https://oktelugu.com/

యంగ్ హీరోతో సిమ్రాన్ రొమాన్స్ !

ఒకప్పటి అందాల హీరోయిన్ సిమ్రాన్ ఇప్పుడు ఓ రొమాంటిక్ పాత్రలో అలరించడానికి సన్నద్ధం అవుతుంది. ఏభై ఏళ్లకు దగ్గరలో ఉన్న ఈ మాజీ బ్యూటీకి రొమాన్స్ పై ఇంకా ఆ తపన ఆ తాపత్రయం ఉన్నాయని, అవకాశాలు వస్తే గ్లామరస్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తానూ ఎప్పుడు ముందు ఉంటానని సిమ్రాన్, సర్దార్ టీమ్ తో చెప్పుకొచ్చింది. దాంతో సర్దార్ లో ఆమెకు అవకాశం దక్కింది. పైగా సిమ్రాన్ ఈ సినిమాలో హీరో […]

Written By:
  • admin
  • , Updated On : June 26, 2021 10:03 am
    Follow us on

    Simranఒకప్పటి అందాల హీరోయిన్ సిమ్రాన్ ఇప్పుడు ఓ రొమాంటిక్ పాత్రలో అలరించడానికి సన్నద్ధం అవుతుంది. ఏభై ఏళ్లకు దగ్గరలో ఉన్న ఈ మాజీ బ్యూటీకి రొమాన్స్ పై ఇంకా ఆ తపన ఆ తాపత్రయం ఉన్నాయని, అవకాశాలు వస్తే గ్లామరస్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తానూ ఎప్పుడు ముందు ఉంటానని సిమ్రాన్, సర్దార్ టీమ్ తో చెప్పుకొచ్చింది.

    దాంతో సర్దార్ లో ఆమెకు అవకాశం దక్కింది. పైగా సిమ్రాన్ ఈ సినిమాలో హీరో కార్తితో డ్యూయెట్లు పాడనుంది. వీళ్లద్దరూ జత కట్టి, ఓ మాస్ సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ తో రెచ్చిపోతారట. ‘సర్దార్’ అనే సినిమాని ఇటీవలే ప్రకటించాడు కార్తీ. అప్పటి నుండి ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ లో చాలామంది పేర్లు అనుకున్నారు. ఓ దశలో నగ్మా కూడా నటిస్తోందని వార్తలు వచ్చాయి.

    అయితే, నగ్మా కార్తీ పక్కన రొమాన్స్ చేస్తే బాగోదు అని ఫీల్ అయిందట. ఆ తరువాత ఈ పాత్ర రమ్యకృష్ణకు వెళ్ళింది. ఎలాంటి బోల్డ్ సీన్స్ కైనా తానూ రెడీ. కానీ అంటూ భారీ రెమ్యునరేషన్ ను చెప్పింది. ఎలాగూ ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా రాశి ఖన్నా ఉంది, ఎక్స్ పోజింగ్ విషయంలో ఆమెకు ఎలాంటి పరిధులు ఉండవు. ఇప్పుడు రమ్యకృష్ణను తీసుకుని భారీ మొత్తాన్ని ముట్టచెప్పడం ఎందుకు అని భావించిన మేకర్స్ మొత్తానికి సిమ్రాన్ ను తీసుకున్నారు.

    నిజానికి సిమ్రాన్ తల్లి పాత్రలకు షిఫ్ట్ అయి, ఆర్టిస్ట్ గా మళ్ళీ బిజీ అవ్వాలనుకుంటున్న టైంలో కార్తీ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడం అంటే, సిమ్రాన్ కెరీర్ కి అది పెద్ద ప్లస్ పాయింటే. ఎలాగూ గతంలో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలో తండ్రి పాత్రకి జోడిగా సిమ్రాన్ నటించి మెప్పించింది. అలాగే ఇటీవల, రజినీకాంత్ సరసన ‘పేట్టా’ సినిమాలో కూడా కనిపించి మెప్పించింది. కాకపోతే సిమ్రాన్ లో మునపటి బిగువు లేదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.