https://oktelugu.com/

ఏపీ, తెలంగాణ నీటి కోట్లాట.. కేంద్రానికి పండుగ

‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు’ ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య నీటి కోట్లాట విషయంలో కేంద్రం తలదూర్చింది. రెండు తెలుగు రాష్ట్రాలే. ఇద్దరు సీఎంలు మంచి మిత్రులే. కూర్చొని మాట్లాడుకుంటే ఈ నీటి కొట్లాట తీరిపోయేది. కానీ రాజకీయ అవసరాలు వారి ఎగదోస్తున్నాయి. స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం యుద్ధానికి ఎగదోస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు ‘కృష్ణా’ నది కోసం కొట్టుకు చస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ నీటి వివాదం ఇప్పటిది కాదు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2021 9:53 am
    Follow us on

    ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు’ ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య నీటి కోట్లాట విషయంలో కేంద్రం తలదూర్చింది. రెండు తెలుగు రాష్ట్రాలే. ఇద్దరు సీఎంలు మంచి మిత్రులే. కూర్చొని మాట్లాడుకుంటే ఈ నీటి కొట్లాట తీరిపోయేది. కానీ రాజకీయ అవసరాలు వారి ఎగదోస్తున్నాయి. స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం యుద్ధానికి ఎగదోస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు ‘కృష్ణా’ నది కోసం కొట్టుకు చస్తున్నాయి.

    ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ నీటి వివాదం ఇప్పటిది కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో తలాపులే కృష్ణా నది నీరు పారుతున్నా.. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా రైతులకు నీరు పారించలేదన్న విమర్శ సగటు తెలంగాణ వాదుల్లో ఉంది. పాలమూరు రైతులు ముంబై, భీవండికి వలసపోయి కరువు జిల్లాను వదిలేసిన దీనస్థితులు కళ్లముందు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులెక్కి.. ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయిన సంగతులు ఎన్నో ఉన్నాయి.

    తెలంగాణ జరిగింది నిజంగా నీటి కేటాయింపుల్లో అన్యాయమే.. నాడు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించింది ఆంధ్రా ప్రాంత నేతలే కావడంతో వారి ప్రాంత ప్రయోజనాలే చూసుకున్నారు. తెలంగాణ రైతుల బాధలు వారి చెవికెక్కలేదు.

    ఆ ఆక్రోశం, కడుపుమంట ఇప్పుడు తెలంగాణ నేతలు, ప్రజాప్రతినిధులు, మంత్రుల్లో కనిపిస్తోంది. కృష్ణా నదిపై అనుమతి లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పుడు తెలంగాణ మంత్రులు, ప్రభుత్వం మండిపడుతున్నది అందుకే. ఇప్పటికే కృష్ణా, నాగార్జున సాగర్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులతో తెలంగాణకు ఆయకట్టు చాలా తక్కువ. ఆంధ్రాకే ఎక్కువ. ఇప్పుడు మళ్లీ సీమకు నీళ్లు తీసుకుపోవడానికి తలపెట్టిన ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఫిర్యాదులు చేస్తోంది.

    రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతి లేకున్నా ముందుకు తీసుకెళ్లిన ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కోర్టు ధిక్కకు పాల్పడితే ఏపీ సీఎస్ ను జైలుకు పంపుతామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. ప్రాథమిక పనులు అంటూ సీమ ప్రాజెక్టును నిర్మిస్తోందంటూ ఏపీ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ ఫిర్యాదు చేసింది. అయితే ఏపీ మాత్రం గత హామీకే కట్టుబడి ఉన్నామని ఏపీ వివరణ ఇస్తోంది.

    ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. రాయలసీమ ఎత్తిపోతలు, ఎన్జీటీ ఆదేశాలపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు. అనుమతులు లేకుండా పనులు చేస్తే చర్యలుంటాయని హామీ ఇచ్చారు. అధికారులు రెండు రోజుల్లో ప్రాజెక్టు పరిశీలనకు వస్తారని వెల్లడించారు. దీంతో ఏపీ, తెలంగాణపోరులో కేంద్రం జోక్యం చేసుకున్నట్టైంది. దీనివల్ల రాష్ట్రాలకు నీటిని వాడుకోకుండా కేంద్రం అడ్డంకులు సృష్టించే అవకాశముంది. అదే తెలుగు రాష్ట్రాలు కలిసి కూర్చొని చర్చించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని పలువురు హితవు పలుకుతున్నారు.