Simran Natekar: సినిమా థియేటర్లో సినిమా పడే ముందు మనకో యాడ్ వస్తుంది. ‘ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు పొగ..మరోవైపు నుసి..’ అని ఈ యాడ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ యాడ్ వల్ల దమ్ముకొట్టేవాళ్లు మానుకున్నారో లేదో తెలియదు గానీ.. ఇందులో నటించిన చిన్న పాప మాత్రం గుర్తుందా? తండ్రి సిగరెట్ చేతిలో పట్టుకుంటే అమాయకంగా చూస్తుంటే జాలి వేస్తుంది. అయితే ఈ పాప ఇప్పుడు తెలుగులో ఓసినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.
ఈ యాడ్ లో నటించిన పాప పేరు సిమ్రాన్ నటేకర్. సిగరెట్ యాడ్ లో నటించిన సిమ్రాన్ నటేకర్ ఆ తరువాత పలు యాడ్లలో నటించింది. ఆ తరువాత ఫేమస్ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’లో పూజ పాత్రతో మెప్పించింది. ఆ తరువాత క్రిష్ 3 లోనూ చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. 2010లో ‘జానె కహన్ సే అయి హై’ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ అమ్మాయికి మాత్రం స్టార్ గుర్తింపు రావడం లేదు.
దీంతో ఆమెకు తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టిందట. పలు ఆడిషన్స్ లోనూ పాల్గొందట. కొందరి డైరెక్టర్లలను ఈ భామ ఇప్పటికే కలిసి తన గురించి చెప్పుకొచ్చిందట. అయితే ఓ డైరెక్టర్ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నాడట. ఆయన ఓకే అయితే తెలుగు సినిమాలో ఈమెను మనం చూడొచ్చన్నమాట. ముంబైకి చెందిన సిమ్రన్ నటేకర్ 1997లో జన్మించింది. చిన్న వయసులోనే యాడ్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెడితే తెలుగు పరిశ్రమ ఆమెకు స్పెషల్ గుర్తింపు ఇచ్చినట్లే.

ఇకఆమె ఇన్ స్ట్రాగ్రాం ఫొటోలు యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ ఈమె గుర్తుపట్టకుండా మారిపోయింది. అందచందాలతో ఆకట్టుకుంటున్న నటేకర్ ను చూసి చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఆమెకు లక్ కుదిరితే తెరపై కూడా చూడొచ్చు. అంతలో ఈ మె ఫొటోలపై ఓ లుక్కేయండి..