Simhadri Re Release Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ అనితర సాధ్యమైనది అని, ఆయన రేంజ్ కి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు ఇంకా చేరుకోలేదని మరోసారి రుజువు అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఆయన హీరో గా నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను రీసెంట్ గా మరోసారి విడుదల అయ్యి ఆల్ టైం రికార్డ్స్ గా నిల్చిన సంగతి తెలిసిందే.
ఖుషి మరియు జల్సా సినిమాల మొదటి రోజు వసూళ్లను ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల అభిమానులు దాటాలని చూసారు కానీ, ఒక్కరి వల్ల కూడా సాధ్యపడలేదు. దీనిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక సవాలు గా స్వీకరించారు, ఎన్టీఆర్ పుట్టిన రోజు కి ఘనంగా ఈ చిత్రాన్ని విడుదల చేసి ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొట్టి ‘నాన్ సింహాద్రి రికార్డ్స్’ అనిపించేలా చేస్తామని చెప్పారు.
అందుకు తగ్గట్టుగానే ప్లానింగ్ కూడా చేసారు.కానీ కలెక్షన్స్ విషయం లో మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేదు.6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని భావిస్తే , మొదటి రోజు కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయిలను మాత్రమే రాబట్టింది.ఈ చిత్రానికి పబ్లిసిటీ దగ్గర నుండి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకు అయిన ఖర్చు రెండు కోట్ల రూపాయలకు పైగానే ఉందట. కానీ వచ్చిన గ్రాస్ కి షేర్ లెక్క కడితే కేవలం కోటి రూపాయిలు మాత్రమే వస్తుందట.
అంటే రీ రిలీజ్ లో నష్టాలను తెచ్చిపెట్టిందన్నమాట.ముఖ్యంగా ఈ సినిమాకి నైజాం వంటి ప్రాంతాలలో చాలా దారుణమైన వసూళ్లు నమోదు అయ్యాయి.కానీ మొదటి రోజు కోటి రూపాయిలు వచ్చినట్టుగా చూపించారు. దీనిపై సోషల్ మీడియా లో మహేష్ బాబు ఫ్యాన్స్ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే లెవెల్ లో ట్రోల్ల్స్ వేస్తున్నారు.