హీరోయిన్ గా ఎంట్రీలోనే చైతు, అఖిల్ తో వరుసగా సినిమాలు చేసింది నిధి అగర్వాల్. కానీ గ్రాండ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. దురదృష్టం అంటే నిధి అగర్వాల్ దే. ఇప్పటికీ చిన్నాచితకా సినిమాల కోసం కూడా తాపత్రయ పడాల్సి వస్తోంది. నిజానికి నిధి అగర్వాల్ ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే, తాజాగా నిధి ప్రేమ కథ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తమిళ హీరో శింభుతో నిధి ప్రేమాయణం నడుపుతోంది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కనుందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మరి శింబుతో నిధి ఏడడుగులు వేస్తుందో, లేక మధ్యలోనే డ్రాప్ అవుతుందో చూడాలి. గతేడాది ఈశ్వరన్‌తో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన నిధి ప్రస్తుతం మరో తమిళ సినిమాలో నటిస్తోంది. తమిళంలో తన ఫస్ట్ మూవీలో హీరోగా నటించింది శింభునే. స్వతహాగా నిధి గ్లామరస్ బ్యూటీ కావడంతో అతను ఆమె ప్రేమలో పడ్డాడు.
శింబు, హన్సికతో కూడా ప్రేమలో పడ్డాడు. హన్సిక అతన్ని పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పాలనుకుంది కూడా. కానీ మధ్యలోనే విడిపోయింది. ఇక హీరో శింబు మందు మత్తులో చిత్తు అయి సక్సెస్ ట్రాక్ తప్పి, పర్సనల్ లైఫ్ ను కూడా మిస్ లీడ్ చేసుకుని మొత్తానికి కొన్నాళ్ళు పాటు ఫేడ్ అవుట్ అయ్యాడు. అయితే, కష్టపడి ఫిట్నెస్ సంపాదించుకుని.. స్లిమ్ గా తయారయి.. కసితో మొత్తానికి విజయాన్ని సాధించాడు. ‘మనాడు’ అనే సినిమా రీసెంట్ గా విడుదలైంది. మంచి హిట్ అయింది.