https://oktelugu.com/

Social Updates: యశ్ పుట్టిన రోజు.. సానా కష్టం అంటున్న అరియానా..!

Social Updates:  ఎప్పటిలాగే సినీ సెలబెట్రీలు తమ రోజువారీ అప్డేడ్స్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ ఈరోజు ముఖ్య అప్డేట్స్ విషయాలను పరిశీలిస్తే.. ముందుగా ఈరోజు కన్నడ రాక్ స్టార్ యశ్ తన 36వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. తన కుటుంబంతో కలిసి కేక్ కట్ చేశాడు. ఇలాంటి బర్త్ డేను ఊహించని లేదని చెబుతూ అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ మీ ప్రేమ ఎల్లప్పుడు ఇలాగే కొనసాగాలనే ఆకాంక్షను యశ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 8, 2022 / 09:22 PM IST
    Follow us on

    Social Updates:  ఎప్పటిలాగే సినీ సెలబెట్రీలు తమ రోజువారీ అప్డేడ్స్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ ఈరోజు ముఖ్య అప్డేట్స్ విషయాలను పరిశీలిస్తే..

    Photo Credit: Instagram

    ముందుగా ఈరోజు కన్నడ రాక్ స్టార్ యశ్ తన 36వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. తన కుటుంబంతో కలిసి కేక్ కట్ చేశాడు. ఇలాంటి బర్త్ డేను ఊహించని లేదని చెబుతూ అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ మీ ప్రేమ ఎల్లప్పుడు ఇలాగే కొనసాగాలనే ఆకాంక్షను యశ్ వ్యక్తం చేశాడు.

    బిగ్ బాస్-4 కంటెస్టెంట్స్ అరియానా, మెహబూబ్ దిల్సే ‘ఆచార్య’ మూవీలోని ఇటీవల రిలీజైన ‘సానా కష్టం’ లిరికల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసి ఆ వీడియో ఇన్ స్ట్రాలో పోస్టు చేశారు. ఇప్పటికే ఈ వీడియో 67వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

    మోహన్ బాబు కూతురు లక్ష్మీ మంచు తన కార్వంటైన్లో ఎలా గడుస్తుందో వీడియో తీసి అభిమానులతో పంచుకుంది. #QuarantineLife #stayingstrong #gocaronago #Laxmiunfiltered అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది.

    Strangers Make Smile అంటూ హీరోయిన్ పూనమ్ భజ్వా ఎద అందాలు, టైస్ షోతో కిరాక్ ఫోజులిచ్చిన పిక్స్ ను ఇన్ స్ట్రాలో షేర్ చేసింది. ఈ పిక్స్ ఇప్పటికే 90వేలకు పైగా లైక్స్ వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

    డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ కొత్త కారును కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కుటుంబంతో దిగిన ఫోటోను ఇన్ స్ట్రాలో షేర్ చేశాడు.

    ‘పుష్ప’లో తనకు నచ్చిన మాస్ స్టిల్ ఇదేనంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో ఓ పిక్ ను పంచుకున్నాడు. రఫ్ అండ్ టఫ్ లుక్కులో బీడీ తాగుతూ మాస్ కా బాప్ అనేలా బన్నీ ఉన్నాడు.