Siddu Jonnalagadda Telusu Kada Movie: సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరో గా నటించిన ‘తెలుసు కదా'(Telusu Kada Movie) చిత్రం రీసెంట్ గానే విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. జాక్ చిత్రానికి వచ్చినట్టుగా ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ అయితే రాలేదు కానీ, పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనే రేంజ్ టాక్ అయితే వచ్చింది. అందుకే అర్బన్ సెంటర్స్ లో ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్ లో అయితే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. సిద్దు జొన్నలగడ్డ కి ఇది కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం గా నిలబడలేకపోవచ్చు కానీ, ఒక డీసెంట్ సినిమాలో నటించాననే తృప్తి అయితే దక్కింది అనుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల తర్వాత హీరో సిద్దు జొన్నలగడ్డ పలువురు సీనియర్ జర్నలిస్టులకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘నాకు ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి వచ్చిన టాక్ విని నేను చాలా సంతోషించాను. కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుందని అన్నారు, కొంతమంది సెకండ్ హాఫ్ బాగుందని అన్నారు. ఇది చాలా మంచి టాక్ అని నేను నమ్ముతా. ఎందుకంటే రెండు హాఫ్స్ లో మనం కంటెంట్ అయితే ఆడియన్స్ కి కావాల్సినదే పెట్టాము. సెకండ్ హాఫ్ తగ్గిందని అనిపిస్తే అది కచ్చితంగా ఇంటర్వెల్ కారణంగానే. నా సినిమాకే కాదు, ఏ సినిమాకు అయినా సెకండ్ హాఫ్ తగ్గడం సర్వ సాధారణం. పని పాటలేని వాళ్ళు ఇంటర్వెల్ అనే కాన్సెప్ట్ ని కనిపెట్టి, పాప్ కార్న్స్ అమ్ముకోడానికి పెట్టిన పంచాయితీ ఇదంతా. హాలీవుడ్ లో అందుకే ఇంటర్వెల్స్ ఉండవు. ఇక్కడ కూడా అలాంటి కాన్సెప్ట్ వస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు జొన్నలగడ్డ.
ఆయన మాట్లాడిన ఈ మాటలను కొంతమంది ఏకీభవిస్తే, మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి, అవి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. మీకు వర్కౌట్ అవ్వలేదని, ఇంటర్వెల్ కాన్సెప్ట్ వేస్ట్ అనడం కరెక్ట్ కాదు అంటూ నెటిజెన్స్ చెప్పుకొచ్చారు. డైరెక్టర్స్ ఇంటెర్వల్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి, ఆడియన్స్ కి ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ కాన్సెప్ట్ తోనే మా తెలుగు సినిమా నేడు ఆస్కార్ వరకు వెళ్ళింది. కాబట్టి ఏది పడితే అది మాట్లాడకండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.
“Second Half ప్రతి సినిమాలో Dip ఉంటది… ఇది Interval అనే Concept వల్ల జరిగింది.
Hollywood లో Interval ఉండదు. ఇది మనోళ్లు Popcorn అమ్ముకోవడానికి చేసిన పంచాయితీ.”
Full Interview: https://t.co/EpNF1Eve31#TelusuKada pic.twitter.com/9YLosnWeVx
— Gulte (@GulteOfficial) October 19, 2025