Siddharth
Siddharth : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేయడం ఎంత కష్టమో దాన్ని రిలీజ్ చేసుకొని సక్సెస్ చేయడం కూడా అంతే కష్టం. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ సమయంలో ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. మన సినిమాకి ఆదరణ దక్కాలి అంటే మిగతా హీరోలను గౌరవిస్తూ వాళ్ళు చేసే సినిమాలను చూస్తూ మనం కూడా మన సినిమాని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్…ఆ తర్వాత చాలా తొందరగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెయిడౌట్ అయిపోయాడు. ఇక అడపదడప సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు సరైన గుర్తింపు అయితే రావడం లేదు. ఇక ఇప్పుడు ‘మిస్ యు’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. ఇక ఈ ఇయర్ ‘భారతీయుడు 2’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం ప్రేక్షకులందరిని సంతోష పెడుతుంది. కానీ ఆయన సినిమాని చూడడానికి మాత్రం ప్రేక్షకులేవరు ముందుకు రావడం లేదు. ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు కేవలం 50 టికెట్లు మాత్రమే బుక్ కావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. ఇక సుదర్శన్ లాంటి పెద్ద థియేటర్లో కేవలం 5 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి.
మరి సిద్ధార్థ్ విషయంలో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే రీసెంట్ గా ఆయన పుష్ప 2 సినిమాని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలైతే చేశాడు. ఇక ఎప్పుడు కాంట్రవర్సీ చేస్తూ వార్తల్లో నిలిచే సిద్దార్థ్ మరోసారి పుష్ప 2 సినిమా విషయంలో కూడా అదే వైఖరిని మెయింటైన్ చేశాడు. పుష్ప 2సినిమా ప్రమోషన్స్ ను పాట్నా లో చేపట్టినప్పుడు ఆ సినిమా కోసం ఎవరు రాలేదని డబ్బులు ఇస్తే అలాంటి జనాలు వస్తారని ఆయన చేసిన కామెంట్లు అల్లు అర్జున్ అభిమానులతో పాటు తెలుగు సినిమా ఆడియన్స్ ను కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టయనే చెప్పాలి.
మరి ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశాడనేది పక్కన పెడితే ఒక సినిమాను తక్కువ చేసి మాట్లాడటం అనేది చాలా వరకు తప్పు…ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాడు. కాబట్టి ఆయన లాంటి ఒక హీరో గురించి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు వాళ్ళు అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఆయన సినిమాకి రావాల్సినంత గుర్తింపైతే రాకపోవడానికి కూడా ఈ వ్యాఖ్యలు కారణమని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఇక సిద్ధార్థ్ ఇప్పటికైనా తన కాంట్రవర్సీ చేసే మాటలను మానుకుంటే మంచిదని మరికొంతమంది అతన్ని హెచ్చరిస్తున్నారు…