Prashant Neel : సినిమా ఇండస్ట్రీ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ సక్సెస్ మాత్రమే వస్తూ ఉంటాయి. వాళ్లకి ఇండస్ట్రీ సక్సెస్ ఫుల్ గా కనిపిస్తుంది. మరికొందరికి మాత్రం ఇక్కడ ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. వాళ్ళు మాత్రం ఫెయిల్యూర్ గానే మిగిలిపోతారు… నిజానికి ఇక్కడ సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి కామన్…కాబట్టి ప్రతి ఒక్కరు వాటిని ఎదుర్కొంటూ విజయాన్ని సాధించాలి తప్ప ప్లాప్ లు వచ్చినంత మాత్రాన సినిమాలు చేయకుండా ఆగిపోకూడదు…
ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకులకు భారీ క్రేజ్ అయితే దక్కుతుంది. వాళ్ళు ఏ సినిమా చేసినా కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. ఇక వాళ్ళ లాంటి దర్శకులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరెవరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకుంటున్నారు. యావత్ ఇండియన్ సినిమా హీరోలందరూ వాళ్ళ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అలాంటి వాళ్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. కే జి ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత చేసిన సలార్ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు కూడా ఆయన ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా ఎన్టీఆర్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలుపుతానని తన ఫ్యాన్స్ కి మాట ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఆ మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఎన్టీఆర్ అభిమానులు చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ కి ఒక భారీ ఇండస్ట్రీ హిట్టు పడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి ఈ సినిమాతో ఆ రికార్డు బ్రేక్ అవుతుందా ఆయనకంటూ సపరేట్ గా ఒక రికార్డు అనేది క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఆయన ఇండస్ట్రీలో తనదైన రీతిలో ముద్ర వేస్తూ ముందుకు సాగడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. మరి డ్రాగన్ సినిమాతో కనక ఆయన భారీ సక్సెస్ ని సాధిస్తే ఆయనకు ఇక మీదట తిరుగు ఉండదనే చెప్పాలి. మరి అలాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమా విషయంలో చాలా వరకు జాగ్రత్తలైతే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా ప్రశాంత్ కెరియర్ లోనే బెస్ట్ సినిమా గా నిలుస్తుందని ఆయన కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు… చూడాలి ఏంటి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ జు సాధిస్తుంది అనేది…