Siddharth: ‘భార్యభర్తలుగా విడిపోయినా, స్నేహితులుగా కలిసే ఉంటాం’ అని సమంత, నాగ చైతన్య తమ విడాకుల వ్యవహారం పై స్పష్టత ఇచ్చిన దగ్గర నుంచి.. ఈ విడాకుల అంశం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. నెటిజన్లతో పాటు ఆర్జీవీ లాంటి వింత జీవులు కూడా తమ నోటికొచ్చినట్లు రకరకాల కామెంట్స్ చేశారు. కానీ తాజాగా మాజీ లవర్ బాయ్ ‘సిద్దార్థ్’ కూడా షాకింగ్ కామెంట్ పెట్టి.. అందరినీ ఆలోచనలోకి నెట్టాడు.

బయటకు చెప్పకపోయినా సిద్దార్థ్ మెసేజ్ చేసింది సమంతను ఉద్దేశించే. ఇంతకీ ఏం మెసేజ్ పెట్టాడు అంటే.. ‘నేను స్కూల్ లో మొదటి సారిగా నేర్చుకున్న లెసన్ ఇదే. ఛీటర్స్ ఎప్పటికీ బాగుపడరు’ అంటూ ‘ సిద్దార్థ్ ఓ కొటేషన్ పోస్ట్ చేశాడు. సిద్దార్థ్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ను డీ కోడ్ చేస్తే.. సమంత గురించే అతను అలా పోస్ట్ పెట్టాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
సిద్ధార్థ్ ఉన్నట్టు ఉండి సమంత మీద ఇలా సెటైర్లు వేయడానికి ముఖ్య కారణం.. గతంలో అంటే.. ‘సిద్దార్థ్ – సమంత’ జబర్దస్త్ సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఇద్దరు కలిసి పూజలు కూడా చేశారు. కానీ తర్వాత ఏమి జరిగిందో తెలియదు గానీ, సమంత చైతుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.
అయితే, చైతుతో పెళ్లి తర్వాత సమంత, సిద్దార్థ్ వ్యవహారం గురించి ఎవరూ మాట్లాడలేదు. చైతు కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే సమంత పరోక్షంగా ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్ గురించి స్పందిస్తూ.. ‘తన జీవితం కూడా మహానటి సావిత్రిలా అయ్యి ఉండేదని, కానీ అదృష్టవశాత్తూ తృటిలో తప్పించుకున్నాను అని చెప్పుకొచ్చింది.
అంటే.. సమంత అప్పుడు సిద్దార్థ్ పై విమర్శలు చేసింది. కానీ, సిద్దార్థ్ మాత్రం ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాడు. అక్కినేని ఇంటికి కోడలు అయిందనే ఆలోచనతో ఎప్పుడు సామ్ పై సిద్దార్థ్ నోరు విప్పలేదు. అయితే, తాజాగా చైతు -సామ్ విడాకుల ఎపిసోడ్ అనంతరం.. సిద్దార్థ్ ఇలా తన కోపాన్ని కామెంట్స్ రూపంలో ప్రదర్శించాడు.