Shyam Singha Roy Box Office Collection
Shyam Singha Roy Box Office Collection: నేచురల్ స్టార్ నానికి మొత్తానికి సాలిడ్ హిట్ వచ్చింది. నాని గత మూడు చిత్రాలు గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీశ్ అనుకున్నంత విజయం సాధించలేదు. పైగా ఆ సినిమాల కారణంగా నాని మార్కెట్ కూడా పడిపోయింది. ఈ నేపథ్యంలో నానికి సూపర్ హిట్ తప్పనిసరి అయింది. దాంతో ఎలాగైనా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ హిట్ కోసం ఎంతో కసితో చేసిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’.
Shyam Singha Roy Box Office Collection
అయితే, ‘శ్యామ్ సింగరాయ్’తో నానికి భారీ హిట్ వచ్చింది. ఈ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి. అలాగే సినిమాకి ఫస్ట్ షో నుంచి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అఖండ, పుష్ప సినిమాల కంటే కూడా శ్యామ్ సింగరాయ్ కే ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
దానికి తగ్గట్టుగానే మొదటి 6 రోజులు పాటు మంచి కలెక్షన్స్ ను రాబట్టాడు శ్యామ్. మరి ఓవరాల్ గా ఈ సినిమాకు ఇప్పటివరకు టోటల్ వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం.
నైజాం 7.55 కోట్లు
గుంటూరు 0.91 కోట్లు
కృష్ణా 0.69 కోట్లు
నెల్లూరు 0.43 కోట్లు
సీడెడ్ 1.95 కోట్లు
ఉత్తరాంధ్ర 1.67 కోట్లు
ఈస్ట్ 0.75 కోట్లు
వెస్ట్ 0.60 కోట్లు
Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !
ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకొని చూస్తే : 14.55 కోట్లు షేర్ వచ్చింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.85 కోట్లు
ఓవర్సీస్ 3.25 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా రూ. 20.65 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.
అన్నట్టు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు కాబట్టి.. ఈ సినిమా లాభనష్టాలన్నీ నిర్మాతకే సొంతం. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 2 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే ఏపిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా చాలా చోట్ల థియేటర్లు మూతపడటం జరిగింది. ఈ వీకెండ్ తో ‘శ్యామ్ సింగ రాయ్’ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనిపిస్తుంది.
Also Read: సడన్ గా థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. అభిమానులంతా షాక్?