https://oktelugu.com/

Shyam Singha Roy: ‘శ్యామ్​ సింగరాయ్’ సెన్సార్ కంప్లీట్​.. సర్టిఫికేట్​ ఏం ఇచ్చారంటే?

Shyam Singha Roy: నాచురల్ స్టార్ నాని హీరోగా పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటిస్తున్న కలకత్తా పీరియాడికల్ యాక్షన్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాని నిర్మిస్తున్నాడు. బెంగాలీ జర్నలిస్ట్ గానూ నానీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 19, 2021 / 03:24 PM IST
    Follow us on

    Shyam Singha Roy: నాచురల్ స్టార్ నాని హీరోగా పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటిస్తున్న కలకత్తా పీరియాడికల్ యాక్షన్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాని నిర్మిస్తున్నాడు. బెంగాలీ జర్నలిస్ట్ గానూ నానీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

    ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సింగిల్స్ తో పాటు ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులో భాగంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. అయితే తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసారు యూనిట్ బృందం.

    “శ్యామ్ సింగరాయ్” సినిమాకి యూ / ఏ సర్టిఫికెట్ ను జారీ చేయగా సినిమా రన్ టైమ్ 2గంటల 35 నిమిషాలు. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు నానీ “శ్యామ్ సింగరాయ్” చిత్రంతో థియేటర్ లో సందడి చేయనుండడం విశేషం. ఈ సినిమాతో నాని కెరియర్ ఇటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి ఈ ఏడాది లో విడుదల చేసిన స్టార్ హీరో సొంత బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. నాని కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తారు లేదో చూడాలి అంటే డిసెంబర్ 24 వరకు ఆగాల్సిందే. అలానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో “దసరా” చిత్రంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “అంటే సుందరానికి” సినిమాలలో నటిస్తున్నాడు.