https://oktelugu.com/

Shyam Singha Roy: ‘శ్యామ్ సింగరాయ్’పై ‘మెగా’ ప్రశంసలు.. సంబరపడిపోతున్న కృతిశెట్టి..!

Shyam Singha Roy: న్యాచురల్ నాని రీసెంట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ పై ప్రశంసలజల్లు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు, సినీ విశ్లేషకులు సాయిపల్లవి, నాని నటనపై ప్రశంసలు కురిస్తూ యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ సైతం ‘శ్యామ్ సింగరాయ్’పై ప్రశంసలు కురిస్తూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. ‘శ్యాయ్ సింగరామ్’ మూవీ డిసెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు నుంచి ఈ మూవీకి మౌత్ టాక్ […]

Written By: , Updated On : January 9, 2022 / 09:18 AM IST
Follow us on

Shyam Singha Roy: న్యాచురల్ నాని రీసెంట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ పై ప్రశంసలజల్లు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు, సినీ విశ్లేషకులు సాయిపల్లవి, నాని నటనపై ప్రశంసలు కురిస్తూ యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ సైతం ‘శ్యామ్ సింగరాయ్’పై ప్రశంసలు కురిస్తూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

Shyam Singha Roy Day 11 collections

Shyam Singha Roy

‘శ్యాయ్ సింగరామ్’ మూవీ డిసెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు నుంచి ఈ మూవీకి మౌత్ టాక్ బాగా రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని పిరియాడికల్ డ్రామాగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించగా నిహారిక ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్లో వెంకట్ బోయినపల్లి మూవీని నిర్మించారు.

నాని, సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’ మూవీని తాజాగా రాంచరణ్ చూసి నాని, సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు వీరద్దరి బెస్ట్ ఫార్మమెన్స్ ‘శ్యామ్ సింగరాయ్’లోనే చూశానని, ఇండస్ట్రీలో మరో ఆణిముత్యం లాంటి సినిమా ఇదని కితాబిచ్చారు.

సాయిపల్లవి, నాని అద్భుతంగా ఉందన్నారు. అలాగే ఈ మూవీలో నటించిన ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి, మడోన్నాలకు రాంచరణ్ కంగ్రాట్స్ చెప్పారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్, చిత్రయూనిట్ సభ్యులందరికీ కుదోస్ అంటూ ట్వీట్ చేశారు. తన ఫేవరేట్ యాక్టర్ నుంచి ప్రశంసలు దక్కడంతో కృతిశెట్టి తెగ సంబరపడి పోతోంది. ‘ఓ మైగాడ్ రాంచరణ్ గారు థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేసి తన ఆనందాన్ని చెర్రీతో పంచుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదలైన ఈ మూవీ అన్ని భాషల్లో కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతోంది.