Site icon OkTelugu

RRR Movie: ‘ఆర్​ఆర్​ఆర్’ ​నుంచి మరో సాంగ్​ రిలీజ్​కు ముహూర్తం ఖరారు!

rrr

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ హీరోలుగా రానున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రోమోలు, పోస్టర్​లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, విడుదల తేదీ కూడా దగ్గరపడుతుండటంతో సినిమాపై రోజుకో కొత్త అడ్​డేట్​ ఇస్తూ.. సినిమాపై హైప్​ పెంచుతున్నారు.తాజాగా విడుదలైన నాటు నాటు పాట ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోతోంది.

తారక్​, చెర్రీలు ఇందులో ఊర మాస్​ స్టెప్పులేస్తూ కనిపించారు. విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్​తో ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోయింది. కాగా, ఈ సినిమాలో తారక్​, చెర్రి వేసిన స్పప్పులు అందర్నీ ఆకర్శించాయి. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు కూడా వీరిని అనుకరించే ప్రయత్నం చేశారు.

కాగా, సినిమాపై మరింత హైప్​ చెందేందుకు మరో ఇంట్రెస్టింగ్​ అప్​డేట్​తో వస్తోంది ఆర్​ఆర్​ఆర్​ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలవ్వగా.. రెండూ మంచి రెస్పాన్స్​ సాధించాయి. కాగా, ఇప్పుడు మూడో పాటకు తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సాంగ్​ను నవంబరు 24న విడుదల కానున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version