Shweta Tiwari: ఈ రోజు ట్రెండింగ్ విషయానికి వస్తే.. యంగ్ హీరోయిన్ శ్వేతా తివారి, మధ్యప్రదేశ్ కి చెందిన నటి ఈమె. అయితే, బోల్డ్ గా ఉండే శ్వేతా తివారి షాకింగ్ కామెంట్స్ చేసింది. పైగా కామెంట్స్ చేసింది దేవుడి పైన. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భోపాల్ లో మీడియా సమావేశంలో శ్వేతా తివారి పాల్గొని మాట్లాడింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘దేవుడు నా బ్రా సైజ్ కొలుస్తున్నాడు’ అని కామెంట్ చేసింది. అయితే, ఆమె అలా మాట్లాడటానికి కారణం.. తన వెబ్ సిరీస్‌ను ఉద్దేశిస్తూ అలా చెప్పింది. తన సిరీస్ లో డైలాగ్ అట అది. ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. దీని పై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంటేనే శ్వేతా తివారి వ్యవహారం ఎంత సీరియస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: మహేష్ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్
పైగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్ర శ్వేతా తివారి కామెంట్స్ పై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. అయినా దేవుడిపై ఇష్టం వచ్చినట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, భక్తులు ఎందుకు ఊరుకుంటారు ? మొత్తానికి శ్వేతా తివారి సరదా తీరేలా ఉంది. అన్నట్టు ఈ బ్యూటీ ఒక హిందీ సినిమాలో కూడా నటిస్తోంది.

మరాఠీ, బాలీవుడ్ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ‘నయ్ వరన్ భట్ లోంచా కొన్ నయ్ కోంచా’ సినిమాలో శ్వేతా తివారి నటిస్తోంది. ఈ సినిమాలో శ్వేతా తివారి శృంగార సన్నివేశాల్లో అభ్యంతరకర రీతిలో రెచ్చిపోయిందట.
Also Read: జగన్‌కు కొత్త టెన్షన్.. జిల్లాల ఏర్పాటుతో వైసీపీలో ఇలా జరుగుతుందేంటి..