https://oktelugu.com/

Shruti Haasan : రోమాన్స్ అంటే ఇష్టం..పెళ్లి అంటే చిరాకు అంటూ శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో శృతి హాసన్ (Sruthi Haasan) పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : January 6, 2025 / 03:55 PM IST

    Shruti Haasan

    Follow us on

    Shruti Haasan : సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో శృతి హాసన్ (Sruthi Haasan) పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఈమె కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగానే వెండితెర అరంగేట్రం చేసినప్పటికీ, ఏ రోజు కూడా తండ్రి పలుకుబడిని ఉపయోగించుకోకుండా, కేవలం తన సొంత టాలెంట్ తోనే ఇంత దూరం వచ్చింది. ఒకప్పుడు ఈమెని ఐరన్ లెగ్ అని పిలిచేవాళ్ళు, ‘గబ్బర్ సింగ్(gabbar singh)’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ గా మారింది. రీసెంట్ గా ఈమె తెలుగు లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. క్రాక్, వకీల్ సాబ్,వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, సలార్ ఇలా కరోనా లాక్ డౌన్ తర్వాత ఈమె తెలుగులో పట్టిందల్లా బంగారం గా మారిపోయింది. అలా సౌత్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ రేట్ ఉన్న ఈ హీరోయిన్ పై కాంట్రవర్సీలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.

    మనసులో ఉన్న విషయాలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా బోల్డ్ గా మాట్లాడడం శృతి హాసన్ స్టైల్. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పెళ్లి, రొమాన్స్ అనే మ్యాటర్స్ పై ఆమె స్పందించిన తీరు చూస్తే ఆశ్చర్యం వేయక తప్పదు. ఆమె మాట్లాడుతూ ‘నా జీవితం లో నేను రిలేషన్ మరియు రొమాన్స్ ని సరిసమానంగా ఆస్వాదిస్తాను. కానీ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక మధ్యలో వదిలేస్తే అసలు భరించలేను, అందుకే నాకు పెళ్లి అంటేనే చిరాకు, దానికి దూరంగా ఉంటాను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడిన ఈ మాటలకు ఇప్పుడు సోషల్ మీడియా లో నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. నువ్వమైనా చేసుకో, అది మాకు ఎందుకు చెప్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం శృతి చాలా సెన్సిటివ్ అనుకుంటా, ముఖ్యంగా రిలేషన్స్ విషయం లో చాలా కచ్చితంగా ఉంటుందని అంటున్నారు.

    ఇదే ఇంటర్వ్యూ లో ఆమె మద్యానికి బానిస అవ్వడానికి గల కారణం కూడా చెప్పింది. తనకి అమ్మానాన్నలు చాలా ఇస్తామని, వాళ్లిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకునే దానిని అని, కానీ వాళ్ళు విడిపోవడం తో మానసికంగా ఎంతో కృంగిపోయిన నేను మద్యానికి బానిసని అయ్యాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటిస్తున్న ‘కూలీ'(Coolie) చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర వంటి సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు నెలలో విడుదల కాబోతుంది. ఈ చిత్రం తర్వాత ‘సలార్ 2 ‘(Salaar 2) షూటింగ్ లో పాల్గొనబోతుంది.