Shruti Haasan Tattoo: స్టార్ కిడ్ శృతి హాసన్ అల్ట్రా మోడ్రన్ గా ఉంటారు. ఆమె అలవాట్లు, లైఫ్ స్టైల్ పాశ్చాత్యులను తలపిస్తుంది. సినిమాలు, పాత్రల ఎంపికే కాదు. ఆమె పర్సనల్ లైఫ్ కూడా చాలా బోల్డ్ గా ఉంటుంది. ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఒంటినిండా టాటూలే. ఆమెకు టాటూలు అంటే మహా పిచ్చి. ఒంటిపై టాటూలు వేయించుకోనే అలవాటు హీరోయిన్స్ లో చాలా మందికి ఉంది. శృతి మాత్రం శరీరంపై చాలా ప్రదేశాల్లో టాటూలు వేయించుకున్నారు. తాజాగా ఓ నెటిజన్ ఆమెను టాటూ గురించి అడిగారు. దానికి శృతి ఆసక్తికర సమాధానం చెప్పింది.

అప్పడప్పుడూ శృతి ఫ్యాన్స్ తో ఇంస్టాగ్రామ్ వేదికగా ముచ్చటిస్తూ ఉంటారు. అలాగే ఇటీవల ఇంస్టాగ్రామ్ ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. ఆ టైం లో శృతిని మీ వంటిపై ఉన్న ఓ టూటూ గురించి చెప్పండి అని అడుగగా… ఓ ఫోటో షేర్ చేసింది. చేతిపై రోజ్ ఫ్లవర్ టాటూ వేయించాను. అయితే అది సరిగా రాలేదు. రోజ్ కాస్తా క్యాబేజిలా కనిపిస్తుంది అంటూ సమాధానం చెప్పింది. శృతి ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.
ఇక శృతి సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. క్రాక్ మూవీతో ఆమెకు సాలిడ్ హిట్ పడగా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు. శృతి చేతిలో ప్రస్తుతం మూడు బడా చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యతో చేస్తున్న చిత్రంలో కూడా శృతి హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవితో మెగా 154 ప్రాజెక్ట్ చేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ మూవీలో సైతం శృతి హీరోయిన్ గా చేస్తున్నారు.

మరోవైపు ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శృతి డేటింగ్ చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా వీరిద్దరూ ముంబైలో కలిసి ఉంటున్నారు. శాంతనుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు శృతి హాసన్ పబ్లిక్ గానే పంచుకుంటారు. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. గతంలో శృతి లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో ఎఫైర్ నడిపారు. 2019లో శృతి, మైఖేల్ బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఆమె శాంతనుకి దగ్గరయ్యారు.



[…] Also Read:Shruti Haasan Tattoo: అక్కడ గులాబీ టాటూ వేయించుకున… […]