https://oktelugu.com/

Bheemla Nayak: త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ అదిరిపోయింది..!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘బీమ్లా నాయక్’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రాబోతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ తారాగాణంతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ‘అయ్యప్పనుమ్ కోషియం’ మలయాళం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2021 / 02:38 PM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘బీమ్లా నాయక్’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రాబోతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ తారాగాణంతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

    Trivikram and Pavan Kalyan

    ‘అయ్యప్పనుమ్ కోషియం’ మలయాళం మూవీని సీతార ఎంటటైన్మెంట్ తెలుగులో రీమేక్ చేస్తోంది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ‘బీమ్లా నాయక్’ కోసం భారీ తారాగాణాన్ని ఆయన తీసుకొచ్చారు. ఈ మూవీలో రానా దగ్గుపాటి, మల్టి టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి విడులైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    ‘బీమ్లానాయక్’ మూవీకి సాగర్ కే.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ పర్యక్షణ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కోరిక మేరకు త్రివిక్రమ్ ప్రత్యేకంగా కొన్ని మార్పులు చేర్పినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కూడా త్రివిక్రమ్ స్టైల్లోనే తెరకెక్కుతుందని సమాచారం. దీనిలో భాగంగా దర్శకుడు సాగర్ చంద్ర కంటే త్రివిక్రమ్ కే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నారని ప్రచారం జరుగుతోంది.

    Also Read: ఆ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న త్రివిక్రమ్…

    ఈ మూవీ బాధ్యతను గురూజీ పర్యవేక్షించినందుకు ఏకంగా ఆయనకు రూ.15కోట్లు ముట్టాయనే టాక్ ఫిల్మ్ నగర్లో విన్పిస్తోంది. చిత్ర దర్శకుడి కంటే త్రివిక్రమ్ కే నిర్మాతలు ఎక్కువ రెమ్యూనేషన్ ఇవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే దర్శకుడు త్రివిక్రమ్ ‘అలవైకుంఠపురం’లో మూవీ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు.

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఎన్టీఆర్ బీజీగా ఉండటంతో త్రివిక్రమ్ ‘బీమ్లా నాయక్’ కోసమే పని చేశాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. దీంతో త్రివిక్రమ్ ‘బీమ్లా నాయక్’ కోసమే తన డేట్స్ మొత్తం కేటాయించి సినిమా కోసం పని చేశారు. ఈ కారణంగానే త్రివిక్రమ్ కు సాగర్ చంద్ర కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ను త్రివిక్రమ్ కు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు టాక్ విన్పిస్తోంది. దీంతో గురుజీ అంటే ‘మాటల’ అంటూ త్రివిక్రమ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: సరికొత్త పంథాలో చెర్రి.. రోజుకో కొత్త లుక్​లో దర్శనం