Shruti Haasan : కమల్ హాసన్ ప్రపంచంలోని గొప్ప నటుల్లో ఒకరు. జీవితాన్ని ఆయన సినిమాకు అంకితం చేశారు. మల్టీ టాలెంటెడ్ కూడాను. సింగర్, రైటర్, డైరెక్టర్, డాన్సర్ అండ్ ప్రొడ్యూసర్. శృతి హాసన్ సైతం తండ్రి లక్షణాలు పుణికి పుచ్చుకుంది. నటనతో పాటు శృతి హాసన్ కి మ్యూజిక్, సింగింగ్, రైటింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. కాగా శ్రుతి హాసన్ చాలా భిన్నంగా ఉంటారు. నచ్చినట్లు జీవిస్తారు. సినిమాలు, పాత్రల ఎంపికలో స్వతంత్ర్యంగా వ్యవహరిస్తోంది. శృతి హాసన్ లో మనకు పాశ్చాత్య సంస్కృతి కనిపిస్తుంది.
కెరీర్ ఆరంభంలోనే శృతి హాసన్ బోల్డ్ రోల్స్ చేసింది. ఇక అఫైర్స్ విషయంలో కూడా ఆమె ఓపెన్. కొన్నాళ్ళు లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో ప్రేమాయణం నడిపింది. మైఖేల్ ని తన కుటుంబ సభ్యులకు సైతం పరిచయం చేసింది. వివాహమే తరువాయి అనుకుంటున్న తరుణంలో బ్రేకప్ చెప్పుకున్నారు. కొంచెం గ్యాప్ ఇచ్చి ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక కు దగ్గరైంది. దాదాపు మూడేళ్లు అతనితో సాన్నిహిత్యంగా ఉంది. ముంబైలో ఒకే ఇంట్లో కలిసి జీవించేవారు.
ఇటీవల శాంతనుతో కూడా శృతి హాసన్ విడిపోయింది. తాజా ఇంటర్వ్యూలో శృతి హాసన్ తన కుటుంబ వ్యవహారాలు, ప్రైవేట్ మేటర్స్ పై స్పందించారు. నాస్తికుడైన కమల్ హాసన్.. కుటుంబ సభ్యులు కూడా దేవుడిని పూజించడానికి ఇష్టపడేవాడు కాదట. దాని వలన బాల్యంలో దేవుడి గురించి తెలియదని ఆమె అన్నారు. శృతి హాసన్ మాట్లాడూతూ.. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. కానీ నాన్న కారణంగా నేను గుడికి వెళ్లేదాన్ని కాదు.
అప్పుడప్పుడు గుడికి, చర్చికి దొంగ చాటుగా వెళ్లేదాన్ని. ఈ విషయం చాలా కాలం నాన్నకు తెలియదు. తాతయ్యతో వెళ్లినా కూడా నాన్నకు తెలిస్తే ఊరుకోడు. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దేవుడు ఉన్నాడనే ధైర్యం వలనే, కానీ దేవుడిని నమ్మడం నాన్నకు ఇష్టం ఉండదు. అమ్మకు భక్తి ఉన్నప్పటికీ చెప్పేది కాదు. మా ఇల్లు పూర్తిగా నాస్తికమైన వాతావరణంతో కూడి ఉండేది. నాకు బాల్యంలో దేవుడు గురించి తెలియదు. దేవుడి శక్తిని నేను కనుగొని, అర్థం చేసుకున్నాను.. అని చెప్పుకొచ్చింది.
ఒక దశలో ఫేడ్ అవుట్ అయిన శృతి హాసన్.. టాలీవుడ్ ఆఫర్స్ తో నిలదొక్కుకుంది. క్రాక్, వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ వంటి హిట్ చిత్రాల్లో శృతి హాసన్ వరుసగా నటించింది.