Shruti Haasan: శ్రుతి హాసన్.. విశ్వ నటుడు ‘కమల్ హాసన్ కుమార్తె’గానే కాకుండా స్టార్ హీరోయిన్ గా కూడా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఐతే, స్టార్ ఇంట పుట్టిపెరిగిన ఎఫెక్ట్ ఏమో గానీ, ఆమె ఎప్పుడూ ముక్కుసూటితనంతోనే ముందుకు పోతుంది. అందుకే, ముందుగా ముక్కుకే సర్జరీ చేయించుకుందని నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తుంటారు అనుకోండి. ఏది ఏమైనా శ్రుతి హాసన్ అంటేనే డేర్ అండ్ డాషింగ్ గర్ల్.

దీనికితోడు, సోషల్ మీడియా వేదికగా తరచూ అభిమానులతో శ్రుతి ఎప్పటికప్పుడు తన భావాలను పంచుకుంటూ ఉంటుంది. ఇంత ఓపెన్ గా ఉండే శ్రుతి హాసన్ కి గతంలో ఒక పర్సనల్ సమస్య ఉండేది. అప్పట్లో ఆమెను ఒంటరి తనం బాగా ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో ఇంటి నుంచి విరిగిన మనసుతో వచ్చిన తనకు, సంగీతం ఒక్కటే ప్రశాంతతను కలిగించింది’ అని ఈ 36 ఏళ్ల స్టార్ హీరోయిన్ చెప్పుకొచ్చింది.
Also Read: ప్చ్.. పవన్ ‘భగత్ సింగ్’లో బూతు సిరీస్ నటుడు
పైగా ఆమె గురించి ఎవరికీ తెలియని ఆ రోజుల్లో ముంబైలోని ఓ రెస్టారెంట్ లో ఆమె ఇంగ్లీష్ పాటలు కూడా పాడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయినా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో శ్రుతి హాసన్ ఎప్పుడో మాస్టర్స్ పూర్తి చేసింది. చివరకు తన ఎఫైర్స్ గురించి కూడా శృతి చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది.
ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసింది ఈ భామ. వారిలో సిద్ధార్ధ్, ధనుష్, క్రికెటర్ సురేష్ రైనా ఇలా కొంతమందితో ఆమెను కలిపి వార్తలు వినిపించాయి. అయితే, శ్రుతి హాసన్ స్వయంగా ఒప్పుకున్న లవ్ స్టోరీలు మాత్రం మూడు. ఒకటి హీరో సిద్ధార్థ్ తో, రెండోది ఇటాలియన్ మైఖేల్ కొర్సాల్ తో, మూడోది శాంతను హజారికాతో. ఈ ముగ్గురితో ఆమె తన ఘాటు ప్రేమాయణాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ లోకానికి వ్యక్తపరుస్తూనే వచ్చింది.

ప్రస్తుతానికి అయితే, శాంతను హజారికాతో శృతి డేటింగ్ లో ఉంది. ఇతను డూడుల్ ఆర్టిస్ట్. నిజానికి ఒక్క సురేష్ రైనా తప్ప ఆమె ఇప్పటివరకు డేటింగ్ చూసినవారంతా నటన, మ్యూజిక్ రంగాలకు చెందినవారే కావడం విశేషం. అంటే, శ్రుతి హాసన్ కు ‘కళాకారులు’ అంటేనే ఇష్టం అనుకుంటా. ఒక్కటి మాత్రం స్పష్టం చెయ్యొచ్చు. గత కొంతకాలంగా శృతి హాసన్ లో బోల్డ్ నెస్ కి అడ్డు అదుపు లేకుండా పోతుంది.
Also Read: పునీత్.. నిన్ను చూసి ‘మనిషి జన్మ’ సంతోషంతో ఎగిరి గంతేస్తోంది