Shruti Haasan: నటసింహం బాలయ్య – షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. అయితే.. తాజాగా శృతి హాసన్ ఈ సినిమా టీమ్ ను ఇబ్బంది పెడుతునట్లు తెలుస్తోంది. అవసరం అయినప్పుడు డేట్లు ఇవ్వకుండా.. అలాగే ఎప్పుడు డేట్లు ఇస్తోందో కూడా చెప్పకుండా మొత్తానికి టార్చర్ చూపిస్తోందట. నిజానికి ఈ సినిమా కోసం లావు కూడా పెరగడానికి ఒప్పుకుంది శృతి హాసన్.

కాకపోతే.. జిమ్ లోనే ఎక్కువ కాలం గడిపే అలవాటు ఉన్న ఈ ముదురు భామకు బాగా ఒళ్ళు చేయడం కష్టం అయిపోయింది. ఎందుకు ఈ అదనపు లావు అంటూ డైరెక్టర్ పై చిరాకు పడుతుందట. మొదటి నుంచీ శృతి హాసన్ బాలయ్యకి జోడీగా ఇంట్రెస్ట్ చూపించలేదు. గోపిచంద్ మలినేని బలవంతం మీద ఆమె ఈ సినిమా ఒప్పుకుంది. సినిమాలో సాధారణ హౌస్ వైఫ్ పాత్ర కాబట్టి.. పెద్దగా కష్టపడాల్సింది ఏమి ఉండదు. శృతి కూడా ఇలాగే ఫీల్ అయ్యింది.
Also Read: సమంత ఆస్తులు ఎంతో తెలుసా.. పెద్దగా కూడబెట్టుకోలేదట..!
కానీ, చూస్తే.. వ్యవహారం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. సహజంగా బాలయ్య సినిమా అంటే.. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాగా శృతి హాసన్ కూడా ఇప్పుడు ఈ యాక్షన్ సీన్స్ లో జాయిన్ కావాల్సి ఉంది. యాక్షన్ సీన్స్ అంటే.. దుమ్ము దూళి పైగా.. రోప్స్ కట్టించుకుని జంప్పింగ్ లు ఉంటాయి. అందుకే.. శృతి ఈ సినిమాకి డేట్లు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరోపక్క ‘స్టార్ట్ కెమరా.. రోలింగ్.. యాక్షన్.. కట్’ అని చెప్పడానికి గోపీచంద్ మలినేని రెడీగా ఉన్నాడు.

అలాగే బాలయ్య కూడా ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చాడు. మరి ఇప్పుడు గోపిచంద్ ఏమి చేస్తాడో చూడాలి. దర్శకుడు గోపీచంద్ మలినేనికి శృతి హాసన్ తో మంచి బంధం ఉంది. పైగా ఆమెకు రెండు సార్లు గోపీచంద్ బ్రేక్ ఇవ్వడంతో.. అతని రిక్వెస్ట్ ను కాదు అనలేక శృతి హాసన్ ఒప్పుకుంది. చివరకు అదే ఇప్పుడు తలనొప్పి అయింది. మరి ఇప్పుడు బాలయ్య గోపిచంద్ ని ఏమి చేస్తారో చూడాలి !!
మరోపక్క బాలయ్యకి సరైన హీరోయిన్ దొరకడం లేదు. బాలయ్య పక్కన హీరోయిన్ గా చేయడం అంటే ఇక ‘సీనియర్ హీరోయిన్’ అనే ముద్రను వేయించుకోవడమే. ఒక సారి ఆ ముద్ర పడితే ఇక ఆ తర్వాత ఏ యంగ్ హీరో సరసన ఆమెకు అవకాశాలు రావు. అందుకే ఏ స్టార్ హీరోయిన్ బాలయ్యతో నటించడానికి ముందుకు రావడం లేదు.
Also Read: ఏపీలో ఏప్రిల్ 8 నుంచి ఇంటర్, మే 2 నుంచి పది పరీక్షలు ప్రారంభం