TRS Privilege Notice: టీఆర్ఎస్ బీజేపీని లక్ష్యంగా చేసుకుని లోక్ సభ, రాజ్యసభల్లో నిలదీయాలని చూస్తోంది. ఇందుకు గాను సభా హక్కుల ఉల్లంఘన నోటీసు రాజ్యసభలో ఇచ్చింది. దీంతో దానిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తోంది. కానీ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభలో లేకపోవడంతో నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కు నోటీసు అందజేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీపై చర్యలు తీసుకుంటారా లేదా అనే దానిపై అందరిలో అనుమానాలు ఉన్నాయి.
బీజేపీపై టీఆర్ఎస్ చేస్తున్న అభాండాలు ఏమేరకు పనిచేస్తాయో తెలియడం లేదు. రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో రూల్ 187 కింద ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వెల్ లోకి దూసుకెళ్లారు. బీజేపీపై నినాదాలు చేశారు.ప్రధానమంత్రి మాటలపై ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలపాలని డిమాండ్ చేశారు.
ప్రివిలేజ్ నోటీసుపై నిర్ణయం తీసుకునే అధికారం చైర్మన్ కు ఉండటంతో ఆయన తిరుపతి పర్యటనలో ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కానీ టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్రధానిపై చర్యలుతీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. తెలంగాణ విషయంలో పీఎం మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని సభను విమర్శించడం సబబు కాదని హితవు పలికారు.
Also Read: రోజాకు ఈసారైనా మంత్రి పదవి దక్కేనా? ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుకుంటారా?
మరోవైపు లోక్ సభలోనూ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దీంతో టీఆర్ఎస్ తీరుపై అందరిలో ఆశ్చర్యం వేస్తోంది. అన్ని పార్టీల నేతలు కూడా టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న విధానానికి నవ్వుకుంటున్నారు. మొత్తానికి దేశంలో బీజేపీని టార్గెట్ చేసుకున్న టీఆర్ఎస్ అన్నింట్లో విమర్శలు చేస్తూ చివరకు తానే విమర్శల్లో చిక్కుకుంటోంది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ చేస్తున్న పనులకు బీజేపీ కూడా సరైన సమాధానాలు చెప్పేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీకి ఇంత చేయాలని చూస్తుంటే జాతీయ పార్టీ బీజేపీ ఇంకా ఎంత చేయాలని బీజేపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పని అయిపోయినట్లే అని భావిస్తున్నారు. దీనికి గాను అన్ని దారులు వెతుకుతున్నారు.
Also Read: TRS vs BJP: టీఆర్ఎస్ సంచలన నిర్ణయం..! ప్రధాని నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన?