https://oktelugu.com/

Shruti Haasan: ప్రస్తుతం సింగిల్ కానీ దానికి ఎప్పుడూ సిద్ధం… శృతి హాసన్ హాట్ కామెంట్స్, వీడియో వైరల్

కొంచెం గ్యాప్ ఇచ్చి ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో రిలేషన్ స్టార్ట్ చేసింది. ముంబైలో ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. తరచుగా శాంతను తో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉండేది శృతి హాసన్.

Written By:
  • S Reddy
  • , Updated On : May 24, 2024 / 02:11 PM IST

    Shruti Haasan confirms her breakup

    Follow us on

    Shruti Haasan: శృతి హాసన్ సోషల్ మీడియా చాట్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమెకు ఓ క్రేజీ ప్రశ్న ఎదురైంది. శృతి హాసన్ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. కమల్ హాసన్ నటవారసురాలు శృతి హాసన్ పై అనేక ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. ఇక లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో అధికారికంగానే ఎఫైర్ నడిపింది. అతని కోసం కెరీర్ కూడా పక్కన పెట్టింది. 2017 తర్వాత శృతి హాసన్ సినిమాలు చేయలేదు. అతడితో పెళ్లి అంటూ పలు రూమర్స్ వచ్చాయి. 2019లో శృతి హాసన్-మైఖేల్ విడిపోయారు. బ్రేకప్ అనంతరం సోషల్ మీడియా అకౌంట్స్ నుండి శృతి హాసన్ ఫోటోలు తొలగించింది.

    కొంచెం గ్యాప్ ఇచ్చి ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో రిలేషన్ స్టార్ట్ చేసింది. ముంబైలో ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. తరచుగా శాంతను తో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉండేది శృతి హాసన్. ఇటీవల అతడికి కూడా గుడ్ బై చెప్పేసింది. ఇంస్టాగ్రామ్ నుండి శాంతనుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తొలగించింది.

    శాంతనుతో బ్రేకప్ నిజమే అని క్లారిటీ వచ్చేసింది. ఈ మధ్య కాలంలో శ్రుతు, శాంతను కలిసి కనిపించిన దాఖలాలు లేవు. తాజాగా శృతి హాసన్ అభిమానులతో ఆన్లైన్ లో చాట్ చేసింది. ఓ వ్యక్తి శ్రుతి హాసన్ ని వ్యక్తిగత ప్రశ్న అడిగారు. మీరు సింగిలా లేదా కమిటెడ్ నా? అని అడిగాడు. శృతి హాసన్ స్పందించారు. ”నిజానికి నేను ఎలాంటి ప్రశ్నలకు స్పందించను. అడిగారు కాబట్టి చెబుతున్నాను. నేను ప్రస్తుతం సింగిల్ కానీ మింగిల్ కావడానికి ఎప్పుడు సిద్ధం. నా వర్క్ ని నేను ఎంజాయ్ చేస్తాను. హ్యాపీగా బ్రతికేస్తా” అని చెప్పింది.

    దాంతో శృతి హాసన్ రిలేషన్ స్టేటస్ పై క్లారిటీ వచ్చింది. ఇక శృతి కెరీర్ పరిశీలిస్తే… క్రాక్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చిన శృతి హాసన్ వకీల్ సాబ్, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. గత ఏడాది శృతి హాసన్ నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. సలార్ మూవీతో 2023ని ఘనంగా ముగించింది. ప్రస్తుతం సలార్ 2 చేస్తుంది. త్వరలో సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.