https://oktelugu.com/

Shruti Haasan: హాట్ ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముద్దుగుమ్మలు!

తాజాగా కొందరు నటీమణులు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలు పెట్టి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఈ వరసలో ముందు ఉంటుంది.

Written By:
  • Shiva
  • , Updated On : September 20, 2023 / 09:18 AM IST
    Follow us on

    చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఎప్పుడు కూడా లైమ్ లైట్ లో ఉండాలి. గతంలో సినిమాలు చేస్తున్న వారు మాత్రమే మీడియా లో కనిపించే వారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని చేతిలో సినిమాలు ఉన్న వాళ్లతో పాటుగా అడపాదడపా సినిమాలు చేసే నటీనటులు కూడా ఏదో ఒక విధంగా మీడియా అటెంక్షన్ పొందుతున్నారు. ముఖ్యంగా అందమైన భామలు సోషల్ మీడియా ను వేడెక్కిస్తున్నారు.

    తాజాగా కొందరు నటీమణులు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలు పెట్టి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఈ వరసలో ముందు ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటుంది. అటు హీరోయిన్ గా ఇటు సింగర్ గా బిజీ బిజీ గా గడుపుతుంది. రీసెంట్ దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది ఈ అమ్ముడు.

    ఇక మరో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి కూడా అందాల ఆరబోతలో తానేమి తక్కువ కాదని నిరూపిస్తుంది. విష్వక్ సేన్ సరసన “ఈ నగరానికి ఏమైంది” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మంచి అవకాశాలను అంది పుచ్చుకుంటుంది. ఇక బిగ్ బాస్ సంచలనం దివి కూడా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది ఈ చిన్నది.

    ఇక బుల్లితెర మీద సత్తా చాటి మెల్లగా వెండితెర వైపు అడుగులు వేస్తున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందాల ఆరబోత విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరించే విష్ణు ప్రియ అప్పుడప్పుడు తన జిమ్ కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మరో హీరోయిన్ బాపు బొమ్మ గా పేరు తెచ్చుకున్న ప్రణీత కూడా సోషల్ మీడియా లో తళుక్కున మెరుస్తూ ఉంటుంది. వీళ్ళు మాత్రమే కాదు అనేక మంది నటీమణులు సోషల్ మీడియా లో దూకుడుగానే ఉంటున్నారు.