https://oktelugu.com/

Shriya Saran: పాప ఉందనే విషయం లేట్ గా బయటపెట్టిన శ్రియ.. కారణం ఏంటి?

నాలుగు పదుల భామ ఇప్పటికీ నెట్టింట్లో కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తోంది. తెలుగులో శ్రియాకు సెకండ్ ఇన్నింగ్స్‌‌లో అంతగా ఆఫర్లేమీ రావడం లేదు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 16, 2023 / 03:56 PM IST

    Shriya Saran

    Follow us on

    Shriya Saran: మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రియ 2001లో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జునతో కలసి నటించిన సంతోషం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత టాప్ హీరోలతో నటిస్తూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇప్పటికీ ఆఫర్స్ అందుకుంటూ కెరీర్లో ముందుకెళుతోంది శ్రియ. మరోవైపు కుటుంబంతో మంచి టైమ్ కూడా స్పెండ్ చేస్తోంది.

    నాలుగు పదుల భామ ఇప్పటికీ నెట్టింట్లో కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తోంది. తెలుగులో శ్రియాకు సెకండ్ ఇన్నింగ్స్‌‌లో అంతగా ఆఫర్లేమీ రావడం లేదు. ఇప్పుడు ఆమె ఫోకస్ పక్క భాషల ఇండస్ట్రీల మీదే ఎక్కువగా ఉందనిపిస్తోంది.శ్రియ శరన్ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి.. హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నారట. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఆ మధ్య వైరల్ అయ్యింది.

    ఇష్టం టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రియ నటించారు. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ ను ఇవ్వలేదు. ఆ తర్వాత నటించిన సంతోషం సినిమా బ్రేక్ ఇచ్చింది. అయితే నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో శ్రియ నటించారు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా హిట్ కొట్టింది. అక్కడ నుంచి శ్రియ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ అయ్యారు. టాప్ స్టార్స్ అందరితో నటించారు. శ్రియ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది.

    అయితే 2018లో శ్రియ ఆండ్రీని పెళ్లి చేసుకుంది. అయితే శ్రియ వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అప్పటికే శ్రియ స్టార్ హీరోయిన్ హోదాకు దూరమయ్యారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా ఓ పాపకు జన్మనిచ్చింది. తాను తల్లైన విషయాన్ని శ్రియ చాలా రోజుల వరకు బయట ప్రపంచానికి తెలియకుండా ఉంచింది. ఈ విషయం కొన్ని రోజుల తర్వాత అందరికి తెలిసింది. అప్పుటి నుంచే శ్రియ పాప ఫోటోలను షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది.