https://oktelugu.com/

Alia Bhatt: అవి చిన్నగా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. బాడీ షేమింగ్ పై ఆలియా భట్ కామెంట్స్..!

హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఉన్న అలియా భట్ కి కూడా బాడీ షేమింగ్ తప్పలేదట. శరీరం విషయంలో ట్రోలింగ్ కి గురైనట్లు ఆమె ఇటీవల వెల్లడించారు.

Written By:
  • Shiva
  • , Updated On : September 16, 2023 / 04:00 PM IST
    Alia Bhatt

    Alia Bhatt

    Follow us on

    Alia Bhatt: బాలీవుడ్ లో స్టార్ లేడీగా వెలిగిపోతుంది అలియా భట్. ఆర్ ఆర్ ఆర్ మూవీతో సౌత్ ఆడియన్స్ కి కూడా చేరువైంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ లో అలియా రామ్ చరణ్ ప్రియురాలి పాత్ర చేసింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో ఆమె ఉన్నారు. నెక్స్ట్ ఆమె దేవర చిత్రంలో నటించాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

    ఈ ఏడాది అలియా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకోవడం మరొక విశేషం. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కతియావాడి చిత్రంలో నటనకు గానూ ఆమెకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. పీరియాడిక్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అలియా భట్ వేశ్య పాత్ర చేయడం విశేషం. ఒకప్పడు ముంబై రెడ్ లైట్ ఏరియాలో డాన్ గా ఎదిగిన మహిళ జీవితమే ఈ చిత్రం.

    హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఉన్న అలియా భట్ కి కూడా బాడీ షేమింగ్ తప్పలేదట. శరీరం విషయంలో ట్రోలింగ్ కి గురైనట్లు ఆమె ఇటీవల వెల్లడించారు. నా ఎద భాగం చిన్నగా ఉందని కొందరు అవమానించారు. హీరోయిన్ కావాలంటే శరీరం నిర్దిష్ట ప్రమాణాలు కలిగి ఉండలా అని నాకు అనిపించింది. ఈ విమర్శలు పట్టించుకోకుండా నేను ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళాను.

    అందుకే నేను నేడు ఈ స్థాయిలో ఉన్నాను. ఇతరుల కామెంట్స్ మనం మనసులోకి తీసుకోకూడదని ఆమె చెప్పుకొచ్చారు. అలియా భట్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. రణ్వీర్ సింగ్ కి జంటగా ఆమె నటించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా పెద్దగా సత్తా చూపలేదు. ఇక గత ఏడాది అలియా భట్ హీరో రన్బీర్ కపూర్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక అమ్మాయి. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ ఈమె తండ్రి.