టబు, అనసూయ, రమ్యకృష్ణ, శిల్పా శెట్టి, నయనతార.. ఏంటీ ఈ లిస్ట్ అనుకుంటున్నారా?. యువ హీరో నితిన్ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం వినిపించిన పేర్లు. తాజాగా ఈ జాబితాలో కొత్త పేరు చేరింది. ఈ మధ్యే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన నితిన్ ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ‘భీష్మ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న అతను ప్రస్తుతం ‘రంగ్‌దే’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్. అలాగే, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’కు కూడా కొబ్బరి కాయ కొట్టాడు. ఠాగూర్ మధు సమర్పణలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నిఖితా రెడ్డి నిర్మించే ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథ, కథనంలో కొన్ని మార్పులతో పక్కా స్క్రిప్టు రెడీ చేశాడు మేర్లపాక.
Also Read: ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్ డేట్స్ !
మాతృకలో బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా, సీనియర్ నటి టబు విలన్ పాత్ర పోషించింది. రాధికా ఆప్టే హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంలో హీరో అంధుడు. తనను అంతం చేయాలనుకునే ఓ మహిళ నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడనేదే కథాంశం. హిందీలో ఆయుష్మాన్ ఇరగదీసిన అంధుడి పాత్రను తెలుగులో నితిన్ పోషించనున్నాడు. అయితే, సినిమాకు అత్యంత కీలకమైన విలన్ పాత్రను తెలుగులో ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. ముందుగా చెప్పినట్టు ఈ పాత్ర కోసం చాలా పేర్లు వినిపించాయి. మాతృకలో చేసిన టబునే సంప్రదించగా ఆమె ఒప్పుకోలేదు. తర్వాత హాట్ యాంకర్ అనసూయ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ, ఆమె కూడా అంగీకారం తెలపకపోవడంతో రమ్యకృష్ణ, అలనాటి అందాల నటి శిల్పా నటి పేర్లు కూడా వినిపించాయి. శిల్ప అయితే సినిమాకు ఒప్పుకుందని చాలా ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందని అన్నారు. కానీ, అందులో నిజం లేదని తేలింది. ఇక, ధైర్యం చేసి సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారను కూడా సంప్రదించగా చిత్ర బృందానికి నిరాశే ఎదురైందట.
Also Read: ఎక్స్ క్లూజివ్ : మెగాస్టార్ – వినాయక్ సినిమా డిటైల్స్ !
ఇక లాభం లేదని చివరి ప్రయత్నంగా మరో సీనియర్ నటి శ్రియ శరణ్‌కు కథ వినిపించాడట మేర్లపాక గాంధీ. అటు సీనియర్ హీరోలు, ఇటు కుర్రాళ్ల సరసన నటిస్తూ… హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్ సాంగ్స్, చిన్న పాత్రలు చేస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న శ్రియకు ఈ కథ బాగా నచ్చిందట. పైగా, తానిప్పటిదాకా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయకపోవడంతో ఈ మూవీతో ఆ లోటు కూడా పూడ్చినట్టు అవుతుందని ఆమె భావిస్తోందట. దాంతో, నితిన్ మూవీలో విలన్‌గా నటించేందుకు ఆమె డేట్స్ ఇచ్చేసిందని తెలుస్తోంది. దాంతో, చాన్నాళ్లుగా లేడీ విలన్ అన్వేషణలో ఉన్న ఈ చిత్ర బృందానికి ఎట్టకేలకు ఉపశమనం కలిగిందట. దీనిపై తొందర్లోనే ప్రకటన చేసి వీలైనంత త్వరగా చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.