
సినిమాకి ఒక మంచి డైరెక్టర్ ఎంత ముఖ్యమో.. మంచి రైటర్ కూడా అంతే ముఖ్యం. సినిమా హిట్ ప్లాప్ లను డిసైడ్ చేసే కెపాసిటీ ఈ ఇద్దరికే ఎక్కువగా ఉంటుంది. కానీ రైటర్ కు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందని ఫిల్మ్ సర్కిల్స్ రెగ్యులర్ గా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒక్కోసారి కొంతమంది పేరు కోసమో.. లేక డబ్బులు కోసమో మొత్తానికి ఫలానా సినిమా కథ నాది, ఫలానా డైరెక్టర్ కాపీ కొట్టాడు అని అనవసర ఆరోపణలు చేస్తుంటారు. ఇలాగే మెగాస్టార్ ఆచార్య సినిమా కథ తనదే అంటూ ఓ కొత్త రచయిత ఆరోపించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది టీమ్.
Also Read: అనసూయ కోలీవుడ్ ఎంట్రీ ఖాయం
అయితే మోషన్ పోస్టర్ లో ధర్మస్థలి అనే నేమ్ ను బాగా హైలైట్ చేశారు. కాగా ఈ ధర్మస్థలి అనే పాయింట్ ను తన స్టోరీ పుణ్యభూమి నుండి కాపీ కొట్టారని, తన పుణ్యభూమి స్క్రిప్ట్ ను 2006లో రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేశానని.. కొరటాల శివ తన స్క్రిప్ట్ ను కాపీ చేసి మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేస్తున్నాడని.. నాకు అన్యాయం జరిగిందని అనిల్ అనే వ్యక్తి ఆరోపించారు. కాగా తాజాగా నిర్మాతలు ఈ ఆరోపణల పై స్పందించారు. ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తోన్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు ఓ ప్రెస్ నోట్ ను అధికారికంగా విడుదల చేశాయి.
నిర్మాతల మాటల్లో.. ‘ఆచార్య కథ పూర్తి కొత్తది, ఆ కథ కొరటాల శివ స్వయంగా రాసాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. బయట వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆచార్య కథ కాపీ స్టోరీ కానే కాదు. మెగాస్టార్ చిరంజీవిగారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోస్టర్ పోస్టర్ కు విపరీతమైన ఆదరణను దక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఆదరణ చూసిన దగ్గర నుండే కొంతమంది ఇలాంటి రూమర్స్ ను పుట్టిస్తున్నారు. దానికి తోడు కొంతమంది రచయితలు ఆచార్య కథ తమ కథ అని చెప్పుకుంటూ అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్ డేట్స్ !
అసలు ఆచార్య కథను మేము ఎంతో గుప్తంగా ఉంచడం జరిగింది. ఈ కథ కేవలం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాము. కేవలం మోషన్ పోస్టర్‌ను ఆదారంగా చేసుకుని ఈ కథ కాపీ అని చెప్పడం ఏ మాత్రం భావ్యం కాదు. ఈ కాపీ వార్తలన్నీ పూర్తి అవాస్తవాలే. అందరికీ మరోసారి మేము క్లారిటీగా చెబుతున్నాము. ఆచార్య కథ కాపీ అంటూ వస్తోన్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలే ’ అని నిర్మాతలు మొత్తానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.