మాజీ హీరోయిన్ శ్రియా నటిగా మళ్లీ బిజీ కావాలని ఆశ పడుతుంది. ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న “ఆర్ఆర్ఆర్”లో ఏదో చిన్న పాత్ర ఒకటి పోషిస్తోంది. కానీ ఆమె పాత్రకి ఎలాంటి ప్రాముఖ్యత లేదని టాక్. అజయ్ దేవగన్ హీరో కాబట్టి, అలాంటి మాస్ హీరోకి హీరోయిన్ లేకపోతే ఆయన అభిమానులు ఫీల్ అవుతారు కాబట్టి, ఆమెను అజయ్ పక్కన ఎదో జూనియర్ ఆర్టిస్ట్ లా తీసుకున్నారు.
కాబట్టి, శ్రియాకి ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేదు. కనిపించేదే కొన్ని సెకన్లు అయినప్పుడు, ఇక డైలాగ్స్ ఏమి ఉంటాయి ? సో.. శ్రియాకి ఆర్ఆర్ఆర్ పెద్దగా వర్కౌట్ కాదు. కానీ ఈ సినిమా విడుదల తర్వాత తనకు మరిన్ని ఆఫర్లు పెరుగుతాయని శ్రియా ఆశ పడుతుంది. కలలు కంటుంది. అయినా ఇప్పటికే ఆమె 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకొంది.
పైగా పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లయిన తర్వాత విదేశాల్లో స్థిరపడి.. ఈ మధ్యే ఇండియాకు వచ్చేసింది. ఎలాగూ ఇండియాలో సెటిల్ అయింది కాబట్టి.. అవకాశాలు కోసం హిందీ దర్శకుల చుట్టూ తిరుగుతుంది. కానీ ఆమెకు హిందీలో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఐతే, ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతోంది. తెలుగులో తనకు ఇంకా ఇమేజ్ ఉంది కాబట్టి, ఇక్కడ ఛాన్స్ లు వస్తాయని ఊహిస్తోంది.
మరి శ్రియా కొత్త ఇన్నింగ్స్ టాలీవుడ్ లో ఎలా సాగుతుందో చూడాలి. అయితే, శ్రియాలోని అందాల సోయగం విషయంలో ఇప్పటికీ ఏ మార్పు లేదు. కానీ శ్రియాకి మెయిన్ హీరోయిన్ గా కెరీర్ ఎప్పుడో క్లోజ్ అయింది కాబట్టి, ఇక సైడ్ క్యారెక్టర్లకు పరిమితం అవ్వాలి. అయితే సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా ఛాన్స్ లు వస్తాయని శ్రియా ఆశిస్తోంది. కానీ కాజల్ అగర్వాల్, తమన్నా వంటి భామలు సీనియర్ హీరోల కోసం కాసుకొని కూర్చున్నారు. ఆ కోణంలో శ్రియాకి వచ్చేది ఏమి లేదు.