https://oktelugu.com/

Swag: శ్రీ విష్ణు ‘స్వాగ్’ మూవీ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్..పాజిటివ్ టాక్ తో కూడా భారీ నష్టాలు!

విడుదలైన మొదటి ఆట నుండే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం బ్రేక్ ఈవెన్ కి సరిపడ రాలేదు. విడుదలకు ముందు ఈ సినిమాకి దాదాపుగా 8 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 17, 2024 / 04:47 PM IST

    Swag Collection

    Follow us on

    Swag: యంగ్ హీరోలలో ఆసక్తికరమైన కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను ఎల్లప్పుడూ థ్రిల్ కి గురి చేసే హీరో శ్రీ విష్ణు. ఈయన సినిమా వస్తుందంటే ఒక ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు ఆడియన్స్. ముఖ్యంగా కొత్తధనం కోరుకునే ప్రేక్షకులు శ్రీవిష్ణు సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న శ్రీ విష్ణు, లేటెస్ట్ గా ‘స్వాగ్’ అనే చిత్రం చేసాడు. ఈ చిత్రంలో ఆయన ఏకంగా 5 పాత్రలు పోషించాడు. డ్యూయల్ రోల్, ట్రిపుల్ రోల్ చేసిన హీరోలను చూసాము కానీ, ఏకంగా 5 పాత్రలు ఒకే సినిమాలో పోషించిన నేటి తరం హీరో గా శ్రీవిష్ణు ఒక అరుదైన రికార్డుని ఈ సినిమా ద్వారా నెలకొల్పాడు. 5 పాత్రలు చేయాలనుకోవడం పెద్ద సాహసమే, చాలా మంది ప్రయత్నం చేసి విఫలం అయ్యారు, కానీ శ్రీ విష్ణు మాత్రం ప్రేక్షకులను అలరించడం లో సక్సెస్ అయ్యాడు.

    విడుదలైన మొదటి ఆట నుండే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం బ్రేక్ ఈవెన్ కి సరిపడ రాలేదు. విడుదలకు ముందు ఈ సినిమాకి దాదాపుగా 8 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వీకెండ్ లో మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 5 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరీశీలిస్తే, నైజాం ప్రాంతం లో కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర ప్రదేశ్ లో కోటి 20 లక్షల రూపాయిలను రాబట్టింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, కర్ణాటక లో 25 లక్షలు, ఓవర్సీస్ లో కోటి రూపాయిలను రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా లో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రిటర్న్ జీఎస్టీ తో కలిపి 5 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

    ఓవరాల్ గా రెండు కోట్ల రూపాయలకు పైగా నష్టాలను బయ్యర్స్ కి మిగిల్చింది ఈ చిత్రం. అయితే థియేట్రికల్ పరంగా ఫ్లాప్ అయ్యినప్పటికీ, ఓటీటీ, సాటిలైట్ రైట్స్ ద్వారా నిర్మాతకి భారీ లాభాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలకు ఓటీటీ లో మంచి రెస్పాన్స్ రావడాన్ని మనమంతా ఇటీవల కాలం లో గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ చిత్రానికి కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ని కొనుగోలు చేసింది. ఈ నెలాఖరున, లేదా నవంబర్ మొదటి వారం లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.