https://oktelugu.com/

Shraddha Kapoor: ఆ స్టార్ హీరోయిన్ తన ప్రియుడిని వదిలేసింది

Shraddha Kapoor: బాలీవుడ్ స్టార్ బ్యూటీ ‘శ్రద్ధా కపూర్’ పెళ్లి పై ఇప్పటికే అనేక రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. రీసెంట్ గా కూడా ఈ బ్యూటీకి పెళ్ళి ఫిక్స్ అయిందని.. చాలా కాలంగా శ్రద్ధ తన చిన్ననాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠతో పీకల్లోతు ప్రేమలో మునిగి తడిసి ముద్దవుతూ ఉందని.. మరీ అంత మునిగిపోయాక, ఇక పెళ్లి చేసుకోకపోతే ఏం బాగుంటుందని.. అందుకే, ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని మొత్తానికి ఒక్క అభిప్రాయానికి వచ్చేసి పెళ్లిని […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2022 / 04:54 PM IST
    Follow us on

    Shraddha Kapoor: బాలీవుడ్ స్టార్ బ్యూటీ ‘శ్రద్ధా కపూర్’ పెళ్లి పై ఇప్పటికే అనేక రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. రీసెంట్ గా కూడా ఈ బ్యూటీకి పెళ్ళి ఫిక్స్ అయిందని.. చాలా కాలంగా శ్రద్ధ తన చిన్ననాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠతో పీకల్లోతు ప్రేమలో మునిగి తడిసి ముద్దవుతూ ఉందని.. మరీ అంత మునిగిపోయాక, ఇక పెళ్లి చేసుకోకపోతే ఏం బాగుంటుందని.. అందుకే, ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని మొత్తానికి ఒక్క అభిప్రాయానికి వచ్చేసి పెళ్లిని ఖాయం చేశారని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది.

    Shraddha Kapoor

    పైగా శ్రద్ధా కపూర్ రోహన్ శ్రేష్ఠని పెళ్లాడనుందనే వార్తల పై ఆమె తండ్రి కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. శ్రద్ధా నిజంగా రోహన్ ని పెళ్లాడాలనుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని శ్రద్ధ తండ్రి శక్తి కపూర్ ఇప్పటికే మీడియాకి డైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చాడు. ఐతే, తన కూతురు ఇప్పటివరకూ తనతో పెళ్లి ప్రస్తావన తేలేదు అని, అందుకే నేను కూడా ఆమె పెళ్లి గురించి ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన చెప్పుకొచ్చాడు.

    Also Read: Salman Khan- Megastar Chiranjeevi: సల్మాన్ తో చిరు షూట్ పూర్తయింది.. పాత్ర అదే

    శక్తి కపూర్ అమాయకంగా మరో డైలాగ్ కూడా చెప్పాడు. నిజంగా ఆమె రోహన్ శ్రేష్ఠతో రిలేషన్ లో ఉందా ? లేదా ? అనే డౌట్ నాకూ ఉందని శ్రద్ధ తండ్రి అప్పట్లో చెప్పుకొచ్చాడు.ఇటు రోహన్ తండ్రి కూడా అదే మాట మీడియాతో చెప్పాడు. “నా కొడుకు శ్రద్ధ కపూర్ ని పెళ్లి చేసుకోవాలంటే… ఆనందంగా ఒప్పుకుంటాం. కొడుకు ఇష్టాన్ని కాదనే వ్యక్తిత్వం కాదు మాది,” అని ఆయన తన అభిప్రాయాన్ని సగర్వంగా చెప్పాడు.

    మొత్తానికి ఇరు కుటుంబ పెద్దలు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి.. శ్రద్ధా కపూర్ – సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ పెళ్లి ఖాయం అనుకున్నారు అంతా. కానీ, వ్యవహారం తాజాగా మారిపోయింది. మరి సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ గా ఉన్న రోహన్ శ్రేష్ఠ పై స్టార్ హీరోయిన్ శ్రద్దా చిన్న చూపు చూసింది.

    Shraddha Kapoor

    నిజానికి శ్రద్ధా కపూర్ రోహన్ శ్రేష్ఠతో నాలుగేళ్లుగా డేటింగ్‌లో ఉంది. అయితే, తాజాగా అతడికి శ్రద్ధా బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. వారి విడిపోవడానికి గల కారణాలు తెలియలేదు. అయితే ఇటీవల గోవాలో జరిగిన శ్రద్ధా పుట్టినరోజు వేడుకల్లో రోహన్ పాల్గొనలేదు. శ్రద్ధా-రోహన్‌లు జనవరి నుంచి దూరంగా ఉన్నారని, తాజాగా విడిపోయారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    అటు శ్రద్ధ కపూర్ తండ్రి, బహిరంగంగా తన ప్రేమ పెళ్ళికి ఓకే చెప్పినా.. శ్రద్ధా కపూర్ మాత్రం తన ప్రియుడితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇంతకీ ఈ వార్తల పై శ్రద్ధా రియాక్ట్ అవుతుందో..? లేక, ఎప్పటిలాగే.. పెళ్లి అంటే, చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ గా వెళిపోతుందా ? చూడాలి.

    Also Read: Mahesh Babu Tweets On RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మహేష్ స్పందన.. వైరల్ అవుతున్న ట్వీట్స్ !

    Tags