Homeఎంటర్టైన్మెంట్Salman Khan- Megastar Chiranjeevi: సల్మాన్ తో చిరు షూట్ పూర్తయింది.. పాత్ర అదే

Salman Khan- Megastar Chiranjeevi: సల్మాన్ తో చిరు షూట్ పూర్తయింది.. పాత్ర అదే

Salman Khan- Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న క్రేజీ రీమేక్ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా సల్మాన్ ఖాన్ రీసెంట్ గా ముంబైలో ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ముంబయిలో చిరు, సల్మాన్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్‌ పూర్తి అయినట్టు డైరెక్టర్ మోహన్ రాజా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. సల్మాన్‌ తో ఈ జర్నీ మంచి మెమోరబుల్‌గా సాగిందని పేర్కొన్నారు.

Salman Khan- Megastar Chiranjeevi
Salman Khan- Megastar Chiranjeevi

ఈ సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా చిరు కోసం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పైగా సల్మాన్‌ ఖాన్ ఈ సినిమా కోసం తన డెట్స్‌ సర్దుబాటు చేసి ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీకి తన షెడ్యూల్‌ కెటాయించాడు. అయితే, సల్మాన్ ఏ పాత్రలో నటిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న పృథ్విరాజ్ సుకుమార‌న్ పాత్ర‌నే తెలుగు వెర్షన్ లో స‌ల్మాన్ ఖాన్ చేయబోతున్నాడు.

Also Read: Mahesh Babu Tweets On RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మహేష్ స్పందన.. వైరల్ అవుతున్న ట్వీట్స్ !

నిజానికి సల్మాన్ ఖాన్ ది ఈ సినిమాలో చిన్న అతిథి పాత్ర మాత్రమే. కానీ సల్మాన్ ఖాన్ లాంటి హీరో ఒక్క క్షణం దర్శనమిచ్చినా ఆ సినిమాకి వచ్చే క్రేజ్ వేరు. ఏది ఏమైనా మెగాస్టార్ పై ఉన్న అభిమానంతో సల్మాన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయమే. అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ కి హీరోయిన్ గా లేడి సూపర్‌స్టార్‌ నయనతార నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో సత్యదేవ్‌ కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం ఈ ‘గాడ్ ఫాదర్’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లో ఓ ప్రవేట్ ప్లేస్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ షూట్ లో మెగాస్టార్ తో పాటు సత్యదేవ్ కూడా పాల్గొన్నాడు. ఇక చిరు బర్త్ డే కి వచ్చిన ఈ సినిమా మోషన్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి తలకు క్యాప్‌ తో అలాగే చేతిలో గన్‌ పెట్టుకుని అలా స్టైలిష్‌ గా పోస్టర్ లో కనిపించే సరికి మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసాయి.

Salman Khan- Megastar Chiranjeevi
Salman Khan- Megastar Chiranjeevi

అందుకే, ఈ సినిమా అప్ డేట్ కోసం అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అన్నట్టు గంగవ్వ యూట్యూబ్‌ లో బిగ్ స్టార్. ఫ్రేమ్ లో ఆమె కనబడగానే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. అయితే, గంగవ్వ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలోనే కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పైగా చిరంజీవికి గంగవ్వ తల్లిగా నటిస్తుందని వార్తలు వచ్చాయి.

Also Read: Ruchi Kalra- Asish Mohapatra: ఒకరిని మించి మరొకరు.. ఈ మెగుడు పెళ్లాల విజయయాత్ర

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version