https://oktelugu.com/

Pushpa 2: పుష్ప’ సిరీస్ లో రష్మిక కి బదులుగా ఆ కుర్ర హీరోయిన్ నటించాల్సిందా..? బంగారం లాంటి అవకాశం వదులుకుందిగా!

ఆ సమయంలో ఆమె వేరే సినిమాలతో బిజీ గా ఉండడం వల్ల ఆమెకి బదులుగా రష్మిక ని తీసుకున్నారు. ఒకవేళ పూజ హెగ్డే ఈ సినిమా చేసుంటే ఆమె రేంజ్ ఎలా ఉండేదో మీరే ఊహించుకోండి.

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2024 / 08:48 PM IST
    Follow us on

    Pushpa 2:  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప చిత్రం ఒక మైలు రాయి లాంటిది. ఈ సినిమాకి ముందు ఆయన కేవలం టాలీవుడ్ లో ఒక స్టార్ మాత్రమే. ఈ చిత్రం తర్వాత మాత్రం పాన్ ఇండియన్ సూపర్ స్టార్. భవిష్యత్తులో అల్లు అర్జున్ కెరీర్ లో ‘పుష్ప’ సిరీస్ కంటే పెద్ద హిట్లు రావొచ్చు, కానీ పుష్ప చిత్రం మిగిల్చిన అనుభవాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు. ఆయన అభిమానులకు కూడా ఈ సినిమా ఒక మధురమైన జ్ఞాపకం. కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే కాదు. ఈ సినిమాలో పని చేసిన ప్రతీ నటుడికి, టెక్నీషియన్ కి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని కేవలం తెలుగు వెర్షన్ లో విడుదల చేస్తే సరిపోతుందని డైరెక్టర్ సుకుమార్ అన్నాడు. కానీ అల్లు అర్జున్ పట్టుబట్టి నేషనల్ వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలయ్యేలా చేసాడు.

    హిందీ లో కేవలం రెండు కోట్ల రూపాయిల ఓపెనింగ్ వసూళ్లతో మొదలైన ‘పుష్ప’ బాక్స్ ఆఫీస్ ప్రయాణం, 140 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే రేంజ్ కి వెళ్ళింది. ఇక ఓటీటీ లో విడుదలైన తర్వాత పుష్ప రీచ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరింది. అలా జనాల్లో బలమైన ప్రభావం చూపించింది ఈ చిత్రానికి, సీక్వెల్ గా విడుదలైన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు ఏ స్థాయి గ్రాస్ వసూళ్లను రాబడుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రెండు రోజుల్లో 440 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మొదటి వారంలోనే 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో రెండు వేల కోట్ల రూపాయలకు రాబడుతుందని ట్రేడ్ పండితులు బలమైన నమ్మకంతో ఉన్నారు. మరి ఈ చిత్రం ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది సోమవారం వచ్చే వసూళ్ల మీద ఆధారపడి ఉంటుంది.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ద్వారానే రష్మిక పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించింది. ఇప్పుడు వరుసగా ఆమె బాలీవుడ్ లో స్టార్స్ సరసన అవకాశాలను సంపాదిస్తుంది. గత ఏడాది ఈమె ‘ఎనిమల్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రష్మిక కి కూడా నటిగా మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత ఆమె సల్మాన్ ఖాన్ ‘సికందర్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈమె ఈ రేంజ్ కి ఎదగడానికి కారణమైన పుష్ప చిత్రంలో, ముందుగా ఈమెని హీరోయిన్ గా అనుకోలేదట. ఈమెకు బదులుగా పూజా హెగ్డే ని తీసుకోవాలని అనుకున్నారట. ఆ సమయంలో ఆమె వేరే సినిమాలతో బిజీ గా ఉండడం వల్ల ఆమెకి బదులుగా రష్మిక ని తీసుకున్నారు. ఒకవేళ పూజ హెగ్డే ఈ సినిమా చేసుంటే ఆమె రేంజ్ ఎలా ఉండేదో మీరే ఊహించుకోండి.