Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Kamal Haasan films: కమల్ హాసన్ సినిమాల్లో ఆ రెండు సినిమాలు చిరంజీవి చేయాల్సిందా..?

Chiranjeevi Kamal Haasan films: కమల్ హాసన్ సినిమాల్లో ఆ రెండు సినిమాలు చిరంజీవి చేయాల్సిందా..?

Chiranjeevi Kamal Haasan films: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నింటిలో చాలా వైవిధ్యమైన కథాంశాలైతే ఉంటాయి. ఎలాంటి పాత్రనైనా సరే అలవోక గా చేసి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న నటుడు కూడా తనే కావడం విశేషం…అందుకే డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలంటే దానికి కమల్ హాసన్ అయితేనే కరెక్ట్ అనేంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. కమల్ హాసన్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు. అందులో ఏదో ఒక కొత్తదనాన్ని మనకు చూపిస్తూనే ఉంటాడు. లోకనాయకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. తన స్వీయ డైరెక్షన్లో కూడా కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. ఇక ఏది ఏమైనా కూడా కమల్ హాసన్ స్టార్ హీరో గా మారడానికి తెలుగు దర్శకులు పాత్ర కూడా చాలానే ఉంది.

సింగీతం శ్రీనివాసరావు, కె విశ్వనాథ్ లాంటి దర్శకులు కమల్ హాసన్ లో ఉన్న పూర్తిస్థాయి నటుడిని బయటికి తీశారు. ఇక కమల్ హాసన్ చేసిన రెండు సినిమాలు చిరంజీవి చేయాల్సినవి అనే విషయం మనలో చాలామందికి తెలియదు. కమల్ హాసన్ ‘నాయకుడు’ సినిమాను మణిరత్నం మొదట చిరంజీవితో చేయాలనుకున్నాడు.

కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి అది వర్కౌట్ కాకపోవడంతో కమల్ హాసన్ తో చేశాడు. తమిళ్ లో స్ట్రెయిట్ రిలీజ్ చేయగా, తెలుగులో మాత్రం డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సాగర సంగమం’ సినిమా కూడా మొదట చిరంజీవి దగ్గరికి వచ్చిందట.

కానీ అందులో ముసలి పాత్ర చేయాల్సి ఉన్న నేపథ్యంలో అప్పుడున్న ప్రేక్షకులు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాక చిరంజీవి ఆ పాత్రనైతే రిజెక్ట్ చేశాడు. మొత్తానికైతే ఆ రెండు సినిమాలు కమల్ హాసన్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలవడమే కాకుండా అతన్ని స్టార్ హీరోని చేయడంలో ఈ సినిమాలు కీలకపాత్ర వహించాయి. ఇక చిరంజీవి సైతం మాస్ సినిమాలను చేసుకుంటూ మాస్ హీరోగా అవతరించాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular