Chiranjeevi rejected Euphoria: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకుల హవా కొనసాగుతుంది. ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయిన గుణశేఖర్ సైతం యూత్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘యుఫోరియా’ అనే టైటిల్ తో రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని కూడా శాసించగలిగే కెపాసిటీ తనకు ఉందని గతంలో ఆయన పలు సందర్భాల్లో నిరూపించుకున్నాడు. ఇక మరోసారి యూత్ ఫుల్ సబ్జెక్ట్ ని కూడా తను డీల్ చేయగలను అనే ఒక ప్రయోగాత్మకమైన సినిమాని చేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో గౌతమ్ మీనన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించాడు.ఈ సినిమా స్టోరీని మొదట చిరంజీవికి వినిపించారట. గౌతమ్ మీనన్ చేసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని చిరంజీవి గారితో చేయించాలని గుణశేఖర్ అనుకున్నారు. మొదట చిరంజీవి కి కథ చెప్పాడట. చిరంజీవి ఆ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఆ తర్వాత బాగా ఆలోచించుకొని కొన్ని రోజుల తర్వాత ప్రస్తుతం నేను హీరోగా చేస్తున్నాను.
కాబట్టి ఆ క్యారెక్టర్ చేస్తే నా ఇమేజ్ కి దెబ్బ పడొచ్చు అనే చిరంజీవి ఆ పాత్ర ను సున్నితంగా రిజెక్ట్ చేశారట. మొత్తానికైతే ఆ క్యారెక్టర్ చిరంజీవి చేసి ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అయ్యేది. అలాగే భారీ సక్సెస్ ని కూడా సాధించేదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక గుణశేఖర్ కి చిరంజీవితో చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. గతంలో ఆయన చిరంజీవితో రెండు సినిమాలను చేశాడు. ఒకటి ‘చూడాలని ఉంది’ కాగా, మరొకటి ‘మృగరాజు’… ఇందులో చూడాలని ఉంది సూపర్ హిట్ అయింది. మృగరాజు డిజాస్టర్ అయింది… మళ్ళీ వీళ్ళ కాంబోలో ఇంకో సినిమా రాలేదు…