https://oktelugu.com/

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవసరమా?

Tollywood: కొన్ని వందల సినిమాలు తీసిన దర్శకుడిగా.. నటుడిగా.. కేంద్రమంత్రిగా సేవలందించిన దాసరి నారాయణరావు మృతితో టాలీవుడ్ అనాథ అయిపోయింది. ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ఇటీవల చిరంజీవి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కరోనా కల్లోలం వేళ చాలామందికి సొంతంగా సాయం అందించారు. కోట్ల రూపాయలు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాంట్లు, పేద కళాకారులకు డబ్బు సాయం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. దాసరి నారాయణ రావు తర్వాత చిరంజీవియే ఇక ఇండస్ట్రీ దిక్కు అనుకుంటున్న వేళ సడెన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2021 / 03:50 PM IST
    Follow us on

    Tollywood: కొన్ని వందల సినిమాలు తీసిన దర్శకుడిగా.. నటుడిగా.. కేంద్రమంత్రిగా సేవలందించిన దాసరి నారాయణరావు మృతితో టాలీవుడ్ అనాథ అయిపోయింది. ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ఇటీవల చిరంజీవి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కరోనా కల్లోలం వేళ చాలామందికి సొంతంగా సాయం అందించారు. కోట్ల రూపాయలు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాంట్లు, పేద కళాకారులకు డబ్బు సాయం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. దాసరి నారాయణ రావు తర్వాత చిరంజీవియే ఇక ఇండస్ట్రీ దిక్కు అనుకుంటున్న వేళ సడెన్ గా ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు’ వచ్చాయి.

    chiranjeevi mohan babu

    మా ఎన్నికలు మెగా స్టార్ ఫ్యామిలీకి, చిరంజీవి పెద్దరికానికి పరీక్ష పెట్టాయి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాలని కలలుగన్న చిరంజీవి తనకు దగ్గరైన ప్రకాష్ రాజ్ కు మద్దతిచ్చి గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ పోటీగా దాసరిని అభిమానించే మంచు మోహన్ బాబు రంగంలోకి దిగాక చిరంజీవి కి గట్టి పోటీ ఎదురైంది.

    ఇండస్ట్రీకి పెద్దగా మారడానికి చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలకు మంచు మోహన్ బాబు, విష్ణు ‘మా’ ఎన్నికలతో చెక్ పెట్టింది. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ను ఓడించిన తర్వాత అసలు ‘దాసరి లేని లోటు భర్తీ చేయలేరని.. ఇండస్ట్రీకి మంచు ఫ్యామిలీనే’ పెద్ద దిక్కు అంటూ మోహన్ బాబు వర్గం ప్రచారం చేసుకుంటోంది.

    అయితే ఇప్పటికీ చిరంజీవి పక్కనపెట్టి టాలీవుడ్ ను మంచు ఫ్యామిలీకి అప్పగించడానికి సినీ ప్రముఖులు సిద్ధంగా లేరు. అందుకే కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారట.. ‘అసలు చిత్రసీమకు పెద్ద దిక్కే అవసరం లేదు’ అని తేల్చిపారేస్తున్నారు.

    సినీ పరిశ్రమ అంటేనే ఎవరికి వారు యమునా తీరు. అసలు ఇక్కడ ఎవరి మాట మరొకరు వినరు. అలాంటప్పుడు సలహాలు ఇచ్చి నవ్వుల పాలు కావడం వేస్ట్ అన్న భావన సినీ పెద్దల్లో ఉంది. అందుకే ఇటు చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా ఒప్పుకోలేక.. అటు మోహన్ బాబును అంగీకరించలేక మధ్యేమార్గంగా అసలు టాలీవుడ్ కు ‘ఇండస్ట్రీ పెద్ద దిక్కు’నే అవసరం లేదని తేల్చిపారేశారు. అందరికీ కావాల్సిన సాయం చేసే వారు చేసుకోవచ్చని.. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చని.. ఎవరి క్రేజ్ ప్రకారం వారికి పేరు వస్తుందని చెబుతున్నారు. ఇక్కడ పెద్ద రికం అవసరం లేదంటూ చెబుతున్నారట..