Pooja Hegde Remuneration: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను తూచా తప్పకుండా పాటిస్తుంది పూజా. ఒక్కో సినిమాకు కోట్లు ఛార్జ్ చేస్తూ ఔరా అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ మూవీ కోసం ఆమె ఏకంగా రూ. 5 కోట్లు ఛార్జ్ చేసినట్లు వార్తలు వస్తుండగా అందరూ నోరెళ్ళ బెడుతున్నారు. వరుసగా మూడు డిజాస్టర్స్ ఇచ్చిన పూజా కెరీర్ డల్ అయ్యింది. ఆమె హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రభాస్, చిరంజీవి చిత్రాలైతే ఆల్ టైం డిజాస్టర్స్ లిస్ట్ లో చేరిపోయాయి.

ఒక్క ఫ్లాప్ పడితే చాలు మార్కెట్ పడిపోతుంది. కోట్లు డిమాండ్ చేయడానికి ఆస్కారం లేకుండా పోతుంది. అలాంటిది పూజా మాత్రం రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గడం లేదట. జనగణమన చిత్రానికి ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటుందట. ఇందులో ఆమెకు నాలుగు కోట్లు కాగా, సిబ్బంది వేతనాల రూపంలో మరో కోటి తీసుకుంటున్నారట. జనగణమన చిత్రానికి పూజా రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి భారీ ఎత్తున జనగణమన తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఛార్మి నిర్మాతగా ఉన్నారు. దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఆర్మీ జవానుగా కనిపిస్తాడని సమాచారం. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా పూజా హెగ్డే నటిస్తున్నట్లు ప్రకటించారు. వరుస పరాజయాల నేపథ్యంలో పూజా హెగ్డే ను మహేష్ మూవీ నుండి తొలగించినట్లు వార్తలు వచ్చాయి.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ 28వ చిత్ర హీరోయిన్ గా పూజా హెగ్డేను ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ మూవీకి హీరోయిన్ గా పూజా పేరు పరిశీలనలో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న పూజా, టూ టైర్ హీరోల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
Also Read:Sai Pallavi: సాయి పల్లవికి ఇంత ఫాలోయింగా..? ఈ వైరల్ వీడియో చూడాల్సిందే