
కరోనా సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు కుదుటపడ్డాక.. థియేటర్లు ఓపెన్ చేశాక విడుదలైన మొదటి సినిమాలు ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’. యంగ్ హీరోల ఈ రెండు సినిమాలు నిన్న శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. కరోనా తర్వాత మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి.
యువ విలక్షణ హీరో సత్యదేవ్ హీరోగా వచ్చిన ‘తిమ్మరుసు’ చిత్రం ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.కానీ కరోనా భయాల మధ్య జనాలు థియేటర్లకు రాక జస్ట్ ఓకే అనిపించుకునేలాగానే ఓపెనింగ్స్ తెచ్చుకుందని టాక్. మౌట్ టాక్ తో జనాలు వచ్చే చాన్స్ ఉంది. మెల్లిమెల్లిగా ఈ సినిమా పుంజుకుంటోంది. యావరేజ్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంటోంది.
ఇక బాలనటుడి నుంచి హీరోగా ఎదిగిన తేజా సజ్జు తన ‘జాంబిరెడ్డి’ గ్రాండ్ హిట్ తర్వాత తీసిన ఈ రెండో మూవీ పబ్లిసిటీ వల్ల కొంచెం బెటర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ రెండు సినిమాలకు ఆంధ్రాలో టికెట్ రేట్లు అతి సాధారణంగా ఉండటం.. అక్యుపెన్సీ 50శాతం వరకు మాత్రం ఉండటంతో కలెక్షన్లు యావరేజ్ గానే వచ్చాయి.ఏపీలో నైట్ కర్ఫ్యూను ఆగస్టు 14వరకు పొడిగించడంతో రాత్రి షోలు వేయలేకపోయారు. ఇది ఈ సినిమాలకు దెబ్బగా పరిణమించింది.
ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ డే ‘తిమ్మరుసు’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.15-20 లోల రేంజ్ లో కలెక్షన్స్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఇష్క్ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 లక్షలకు పైగానే కలెక్షన్స్ ను మొదటి రోజు సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రెండు సినిమాల అఫీషియల్ లెక్కలు ఇంకా పూర్తిగా రాలేదు. దీంతో ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.ఫస్ట్ డే కోటి రూపాయలు వసూలు చేసే టాలీవుడ్ లో లక్షల వద్దే ఆగిపోయాయంటే కలెక్షన్స్ దెబ్బపడినట్టే లెక్క.