https://oktelugu.com/

Shanmukh Jaswanth: షణ్ముఖ్ గంజాయి కేసులో విస్తుపోయే నిజాలు… దీప్తి అందుకే వదిలేసిందా?

బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువగానే నమోదైంది. దాంతో కేసు పెద్దది కాలేదు. గాయాలు పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా షణ్ముఖ్ ఏకంగా డ్రగ్ కేసులో బుక్ అయ్యాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 22, 2024 / 06:08 PM IST
    Follow us on

    Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ నటుడిగా, డాన్సర్ గా తెలుసు. షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్లు చేస్తూ స్టార్ యూట్యూబర్ అయ్యాడు. షణ్ముఖ్ చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉంటాడు. కానీ మనోడి అసలు రంగు వేరు. పక్కా జల్సా రాయుడు. ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వ్యసనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. షణ్ముఖ్ 2021లో మొదటిసారి ఓ వివాదంలో వార్తలకు ఎక్కాడు. కారు అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణం అయ్యాడు. ఈ ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. వాహనాలు ధ్వంసం అయ్యాయి. గుద్ది పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

    బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువగానే నమోదైంది. దాంతో కేసు పెద్దది కాలేదు. గాయాలు పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా షణ్ముఖ్ ఏకంగా డ్రగ్ కేసులో బుక్ అయ్యాడు. నిషేదిత గంజాయి తాగుతూ షణ్ముఖ్ అడ్డంగా బుక్ అయ్యాడు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ చేతిలో మోసపోయిన యువతి కంప్లైంట్ కారణంగా… షణ్ముఖ్ గంజాయి తాగుతాడనే విషయం వెలుగులోకి వచ్చింది.

    ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మౌనిక అనే యువతితో సంపత్ కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తీరా ఆమెను కాకుండా మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కాగా అసలు మౌనికను అన్న సంపత్ కి పరిచయం చేసింది షణ్ముఖ్ అట. తన షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో అవకాశం ఇస్తానని కూడా మౌనికకు షణ్ముఖ్ ప్రామిస్ చేశాడట.

    మౌనికతో లైంగిక సంబంధం పెట్టుకున్న సంపత్ ఒకసారి ఆమెకు అబార్షన్ చేయించాడట. అన్ని విధాలా మోసపోయిన మౌనిక… సంపత్ మీద కేసు పెట్టింది. పోలీసులను తీసుకుని షణ్ముఖ్ ఇంటికి వెళ్ళింది. అక్కడ షణ్ముఖ్, సంపత్ గంజాయి సేవిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. మత్తులో ఉన్న షణ్ముఖ్ ని మౌనిక కెమెరాతో షూట్ చేస్తుండగా… అతడు దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. అన్నదమ్ములు ఇద్దరూ ఓ యువతిని మోసం చేయడం సంచలనంగా మారింది.