Chaitanya Master: ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ’ కొరియోగ్రాఫర్ గా అద్భుతంగా రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చైతన్య మాస్టర్ ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక, అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ముఖ్యంగా చనిపోయే ముందు ఆయన పెట్టిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చైతన్య మాస్టర్ ఇంత అప్పులు ఐపోవడానికి, ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆయనతో పని చేయించుకొని, ఇవ్వాల్సిన డబ్బులు సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్లే అని ప్రముఖ డ్యాన్సర్ ఝాన్సీ చెప్పుకొచ్చింది. న్యూ ఇయర్ కి చైతన్య మాస్టర్ ఒక ఈవెంట్ చేసారు. ఈ ఈవెంట్ ప్రారంభం అయ్యే ముందు ఆయన ఓనర్స్ తో కొంతమంది ఆర్టిస్టులను తీసుకొస్తానని మాట ఇచ్చాడట.
అయితే ఆరిస్ట్స్ అందరూ ఆ సమయం లో డుమ్మా కొట్టడం వల్ల ఆ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసే ఓనర్స్ కి నష్టం వచ్చిందట. అందుకే చైతన్య మాస్టర్ ఇస్తానన్న ఆరు లక్షల రూపాయిలను ఆపేశారట. దీనితో మిగిలిన ఆర్టిస్ట్స్ కి ప్రెమెంట్స్ ఇవ్వాలి కాబట్టి, అప్పు చేసి మరి ఇచ్చాడట, ఆ అప్పుని తీర్చడానికి మరో అప్పు, అలా అప్పుల మీద అప్పులు చేసి చివరికి అవి కట్టలేక ఈరోజు ఇలాంటి పని చేసుకున్నాడని ఝాన్సీ ఈ సందర్భంగా మీడియా కి చెప్పుకొచ్చింది. అంతే కాదు , చైతన్య మాస్టర్ కి ఢీ షో నుండి కూడా చాలా డబ్బులు రావాల్సి ఉందట. అందువల్ల ఆయన తన టీం మేట్స్ కి డబ్బులు ఇవ్వలేకపోయాడట, వాళ్ళ దగ్గర మాటలు కూడా పడాల్సి వచ్చేదట.ఇవన్నీ తట్టుకోలేకనే చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.
ఢీ మరియు జబర్దస్త్ షో లో చైతన్య మాస్టర్ లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రదీప్ , సుధీర్, హైపర్ ఆది , సదా మరియు శేఖర్ మాస్టర్ లాంటి టాప్ సెలబ్రిటీస్ కి డబ్బులు ఆపరు కానీ, ఇలా అప్పుడప్పుడే ఎదుగుతున్న చైతన్య మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్స్ కి మాత్రం లక్షల్లో బ్యాలన్స్ పెట్టేస్తుంటారు. రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి పని చేసిన వాళ్లకి సరైన సమయంలో పేమెంట్ అందకపోతే అప్పులు అవ్వడం సహజం , ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా సహజం. ఇలాగె ఉంటే కళని నమ్ముకొని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీ కి వచ్చేవాళ్లు సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇక నుండి అయిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కళ్ళు తెరుస్తుందో లేదో చూడాలి.