Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం పై సోషల్ మీడియా లో ఎంత రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ అంశం రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. అవి నెటిజెన్స్ ని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నేడు ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో అడ్వకేట్ రజిని పవన్ కళ్యాణ్ విడాకుల అంశం పై మాట్లాడిన మాటలు సంచలనం రేపుతోంది. పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడాకులు తీసుకోలేదని కావాలని ఒక పార్టీ కి చెందిన మీడియా ఛానల్ ఈ వార్తని సోషల్ మీడియా లో ప్రచారం చేసిందంటూ చెప్పుకొచ్చారు.
ఒక ప్రముఖ మీడియా ఛానల్ లో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేరుగా ఎక్కడా కూడా విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా చెప్పలేదని , కేవలం ఒక సెక్షన్ మీడియా ఈ వార్తని ప్రచారం చేసిందని , కచ్చితంగా ఇది ఫేక్ న్యూస్ అయ్యి ఉంటుందని , పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి కావాలని ఇలా చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. అన్న లెజినోవా కి సంబంధించిన వ్యాపారాలు , ఆమె పిల్లల చదువు మొత్తం సింగపూర్ లోనే ఉండడం తో , ఆమె తరచూ అక్కడికి వెళ్లి వస్తూంటాది అట. ఆ కారణం చేత ఏడాది లో నెలల తరబడి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందని, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా విడిపోలేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఇది ఫేక్ న్యూస్ అయితే జనసేన సోషల్ మీడియా విభాగం నుండి ఇప్పటికే క్లారిటీ వచ్చేది కదా , ఎందుకు రాలేదు అనేది నెటిజెన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. గతం లో కూడా పవన్ కళ్యాణ్ పై ఇలాంటి అసత్య ప్రచారాలు వచ్చినప్పుడు జనసేన సోషల్ మీడియా విభాగం ఖండించేది, కానీ ఈసారి అది జరగలేదు , దీన్ని బట్టీ ప్రచారం అవుతున్నటువంటి వార్త నిజమేనని జనాలు నమ్మడం లో తప్పు లేదు కదా అని నెటిజెన్స్ అంటున్నారు.