Gangavva: ప్రస్తుతం ఒక సామాన్యుడు సెలబ్రిటీ అవ్వాలంటే సినిమాల్లోకి వెళ్లాల్సిన అవసరం అసలు లేదు..సోషల్ మీడియా ఉంటె చాలు..రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవచ్చు..అలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ ని సంపాదించి సినిమాల్లోకి మరియు రియాలిటీ షోస్ కి వెళ్లిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..వారిలో ఒకరే గంగవ్వ..రీసెంట్ గా ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కూడా నటించింది.

ఎక్కడో చిన్న పల్లెటూరు లో కూలిపని చేసుకుంటూ బ్రతికే గంగవ్వ, తన పల్లెటూరి గొప్పతనం గురించి వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి బాగా పాపులారిటీ ని సంపాదించుకుంది..ఈమె మాట్లాడే యాస కి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు.
అలా ఈమె సంపాదించుకున్న పాపులారిటీ మరియు పొందిన అభిమానం ని గుర్తించి బిగ్ బాస్ యాజమాన్యం ఈమెకి బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం కూడా ఇచ్చింది..హౌస్ లో ఉన్నన్ని రోజులు అద్భుతంగా ఆడింది..వోటింగ్ శాతం లో కూడా అందరికంటే ఈమెకే ఎక్కువ ఓట్లు వచ్చేవి..అయితే పెద్ద వయస్సు ఉన్న ఆమె కావడం తో బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది.

అస్వస్థత కారణం గా కేవలం నాలుగు వారాలు పూర్తి అవ్వగానే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసింది..నాగార్జున ఈమెని బయటకి పంపే ముందు ‘నీకు బిగ్ బాస్ తరుపున ఒక మంచి అందమైన ఇల్లు కట్టిస్తాను’ అని మాట ఇచ్చాడు..ఇచ్చిన మాట ప్రకారమే గంగవ్వకి అందమైన ఇల్లుని కట్టించి ఇచ్చాడు నాగార్జున..అంతే కాకుండా ఈ బిగ్ బాస్ షో ఆమె జాతకమే మార్చేసింది అని చెప్పొచ్చు..వరుసగా క్రేజీ సినిమాల్లో కూడా ఈమెకి అవకాశాలు వచ్చేలా చేసింది బిగ్ బాస్ షో..ఈమె ఒక్క రోజు కాల్ షీట్ అక్షరాలా 12 వేల రూపాయిలు అట.
అంతే కాకుండా ఈమెకి యూట్యూబ్ నుండి ఆమె చేస్తున్న వీడియోస్ కి గాను నెలకి లక్ష రూపాయిలు ఆదాయం కూడా వస్తుందట..అలా రోజు కూలి చేసుకునే గంగవ్వ ఈరోజు నెలకి లక్షల్లో సంపాదిస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా ఏ రేంజ్ లో వృద్దిం చెందింది అనేది.