Bigg Boss 6 Telugu- Keerthy: బిగ్ బాస్ సీసన్ లో ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూసేది వీకెండ్స్ గురించే..ఎందుకంటే ఆ వారం మొత్తం ఎలా ఉన్న ఆ రెండు రోజులు మాత్రం అదిరిపొయ్యే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది..అలాగే హౌస్ మేట్స్ లో ఎవరైనా తప్పులు చేసి ఉంటె నాగార్జున కోటింగ్ ఇస్తాడా లేదా..ఇలాంటి వాటి కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు..అంతే కాకుండా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దానిపై కూడా అమితాసక్తి ఉంటుంది.

అన్ని వీకెండ్స్ లాగానే ఈ వీకెండ్ కూడా బిగ్ బాస్ హౌస్ ఎంటర్టైన్మెంట్ తో నిండిపోయింది..అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఆహ్లాదకరంగా సాగడం తో నాగార్జున గారికి కూడా ఎవరిని మందలించే పని పడలేదు..అయితే ఈ వారం హౌస్ మేట్స్ ఆడిన ఆట తీరు పై నాగార్జున ప్రతీ కంటెస్టెంట్ ‘గుడ్, యావరేజ్ మరియు డెడ్’ అని రేటింగ్స్ ఇచ్చారు..ఇంటి సభ్యులందరు నాగార్జున గారు ఇచ్చిన రేటింగ్స్ కి అంగీకరించి తల ఊపారు కానీ..కీర్తి మాత్రం నాగార్జున గారు తనకి ఇచ్చిన ‘యావరేజి’ రేటింగ్ ని అంగీకరించలేదు.
నాగార్జున గారు యావరేజి రేటింగ్ ఇవ్వగానే కీర్తి వెంటనే రియాక్ట్ అయ్యి ‘సార్ ఏమి అనుకోను అంటే మిమల్ని ఒకటి అడగొచ్చా’ అని అడగగా నాగార్జున వెంటనే ‘అడుగు అమ్మా పర్లేదు’ అంటాడు..అప్పుడు కీర్తి మాట్లాడుతూ ‘సార్..ఈ వారం నేను అన్ని టాస్కులను బాగా ఆడాను..ఆ బాల్ టాస్క్ లో అయితే ఫైమా కంటే నేనే బాగా ఆడాను..ఆమెకి ఏమో గుడ్ అని ఇచ్చారు..నాకు ఏమో బాడ్ అని ఇచ్చారు..ఎందుకు సార్..నేను ఇంటి పనులు చేస్తున్నాను..టాస్కులు ఆడుతున్నాను..అందరితో కలిసిపోయి బాగున్నాను..నాలో ఏమి లోపం ఉందొ చెప్తే నేనే సరి చేసుకుంటాను’ అని కీర్తి అడగగా నాగార్జున దానికి వెంటనే సమాధానం చెప్తూ ‘ఈ వారం మొత్తం ఆ బాల్ టాస్కు గురించే మాట్లాడుతున్నావ్..ఆ టాస్కు ఒక్కటే ఆడవా నువ్వు..?’ అని అడగగా కీర్తి నుండి ఎలాంటి సమాధానం రాలేదు..అప్పుడు నాగార్జున మళ్ళీ మాట్లాడుతూ ‘ఫైమా కంటే బాగా ఆడాను అని నువ్వు అంటున్నావు..ఇదే విషయం ని ఆదిన్స్ ని అడుగుతాను..వాళ్ళు ఏమి చెప్తారో చూద్దాం’ అని నాగార్జున ఆడియన్స్ ని అడుగుతాడు..అప్పుడు ఆడియన్స్ అందరూ ‘నో ‘ అని చెప్తారు..అప్పుడు నాగార్జున ‘చూసావా..ఆడియన్స్ ఏమి అన్నారో..పోనీ నేను నీకు ఒక నిమిషం సమయం ఇస్తున్నాను..ఆడియన్స్ తో నువ్వు మాట్లాడి వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ని తప్పు అని నిరూపించగలవా’ అని అడగగా..అప్పుడు కీర్తి మాట్లాడుతూ ‘ఆడియన్స్ అంతా చూస్తున్నారు కదా సార్’ అంటుంది.

అప్పుడు నాగార్జున ‘చూస్తున్నారు కాబట్టే అలా చెప్పారు..నీకు చాలా క్యాలిబర్ ఉంది..నీ నుండి వాళ్ళు ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు..అది ఇవ్వడానికి ట్రై చెయ్..నీలో ఆ ఫైర్ ని పెంచడానికే ఇదంతా’ అని నాగార్జున గారు చెప్తారు..అప్పుడు కీర్తి ‘ఓకే సార్..వచ్చే వారం మరింత బాగా ఆడుతాను’ అని కూర్చుంటుంది.