Guntur Karam Movie: మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీ మొదలైనప్పటి నుండి అవరోధాలే. అనుకున్న ప్రకారం సెట్స్ పైకి వెళితే ఈ చిత్రం విడుదల కూడా అయ్యేది. త్రివిక్రమ్, మహేష్ ఇతర పనుల్లో బిజీగా ఉండి గుంటూరు కారం ప్రాజెక్ట్ డిలే చేస్తూ వచ్చారు. మొదలయ్యాక కూడా సవ్యంగా షూటింగ్ సాగలేదు. ఫస్ట్ షెడ్యూల్ కొంత షూటింగ్ అయ్యాక షూటింగ్ ఆపేశారని సమాచారం. మళ్ళీ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారట. అలాగే మహేష్-త్రివిక్రమ్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని, షూటింగ్ మధ్యలో ఆపేసి మహేష్ విదేశాలకు వెళ్ళారనే ప్రచారం జరిగింది.
ఈ వార్తలను యూనిట్ ఖండించారు. గుంటూరు కారం షూటింగ్ అయితే అనుకున్న ప్రకారం జరగడం లేదు. దీంతో నటుల డేట్స్ విషయంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. జూన్ 12 నుండి లేటెస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టాల్సి ఉండగా ఆగిపోయిందట. అందుకు ఇతర నటుల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమే కారణమట. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ డేట్స్ సమస్యగా మారాయట. చేసేది లేక మరో నాలుగు రోజులు పోస్ట్ ఫోన్ చేశారట. జూన్ 16 నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారట.
గుంటూరు కారం విషయంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఫ్యాన్స్ లో అసహనానికి కారణం అవుతున్నాయి. మూవీ మీద నెగిటివిటీ పెరిగేలా చేస్తున్నాయి. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ సెట్ అయ్యింది. గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ రెండు చిత్రాలకు ఫ్యాన్స్ లో క్రేజ్ ఉంది.
గుంటూరు కారం మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు. మహేష్ ఊర మాస్ అవతార్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. గుంటూరు కారం మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ కి మహేష్, పూజా హెగ్డేలతో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం.