Punch Prasad: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయనను కిడ్నీ సంబంధిత వ్యాధి బాధిస్తుంది. దీర్ఘకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఆ మధ్య కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అయినా ఫలితం లేదు. మరలా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనకు అర్జెంటుగా ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచ్ ప్రసాద్ కోసం తోటి కమెడియన్స్ క్యాంపైన్ నిర్వహించారు. దాతలు ఆదుకోవాలని ప్రకటనలు చేశారు. కొందరు స్పందించింది పంచ్ ప్రసాద్ కి ఆర్థిక సహాయం చేశారు.
ఖరీదైన వైద్యం కావడంతో ఏపీ సీఎంఓను సంప్రదించారు. ఒకప్పటి జబర్దస్త్ జడ్జి మంత్రి రోజాతో పంచ్ ప్రసాద్ కి పరిచయం ఉన్న నేపథ్యంలో ఆమె బాధ్యత తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచ్ ప్రసాద్ కి ఆపరేషన్ జరిగేలా చూశారు. పంచ్ ప్రసాద్ కి అవసరమైన వైద్య సహాయం అందినట్లు సమాచారం. ఈ క్రమంలో పంచ్ ప్రసాద్ ఏపీ సీఎం జగన్ తో పాటు మంత్రి రోజాకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
పంచ్ ప్రసాద్ కి గతంలో కూడా రోజా ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం. నాగబాబు, రోజా, కొందరు జబర్దస్త్ కమెడియన్స్ పంచ్ ప్రసాద్ వైద్యానికి అవసరమైన డబ్బులు సమకూర్చారు. పదే పదే అనారోగ్య సమస్య వస్తుండగా భారీగా డబ్బులు ఖర్చవుతున్నాయి. ఆరోగ్యం సరిగా లేకున్నా మిత్రుల సహాయంతో ప్రసాద్ స్కిట్స్, బుల్లితెర ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. అలా వచ్చిన డబ్బులు వైద్యానికి ఖర్చు చేస్తున్నారు.
ఆ మధ్య మాజీ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ స్నేహితుడు పంచ్ ప్రసాద్ ని ఆదుకుంటానంటూ ప్రకటన చేశాడు. పంచ్ ప్రసాద్ మంచి వ్యక్తి అతని వైద్యానికి ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను. త్వరలో మణికొండ ఏరియాలో స్టార్ట్ చేసే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాండ్ ఆదాయం నుండి అతని వైద్యానికి వాడతాను. పదిలక్షలు ఖర్చైనా నేను పెట్టుకుంటాను అన్నారు. మరి మణికొండలో కిరాక్ ఆర్పీ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశాడు. ఈ మేరకు ఆర్థిక సహాయం చేస్తున్నాడో సమాచారం లేదు.