https://oktelugu.com/

Shobhita Dulipalla : నాగచైతన్య నావల్ల పడిన ఇబ్బందులు సాధారణమైనవి కావు అంటూ శోభిత దూళిపాళ్ల ఎమోషనల్ కామెంట్స్!

అక్కినేని నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల పెళ్లి జరిగి దాదాపుగా 5 రోజులు కావొస్తుంది. వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 17, 2024 / 03:21 PM IST

    Shobhita Dulipalla

    Follow us on

    Shobhita Dulipalla : అక్కినేని నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల పెళ్లి జరిగి దాదాపుగా 5 రోజులు కావొస్తుంది. వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. అభిమానుల దగ్గర నుండి, ప్రేక్షకుల వరకు అసలు వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది?, ఎలా ఒకరికొకరు పరిచయం అయ్యారు అనేది తెలుసుకోవడం పై అమితాసక్తి ఉంది. ఎందుకంటే వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో శోభిత కమర్షియల్ యాడ్స్ చేసింది కానీ, నాగ చైతన్య తో మాత్రం చేయలేదు. ఒకేచోట పని చేసుకునేవాళ్ళు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం వంటివి ఇన్ని రోజులు చూసాము, అసలు కలిసి ఒక్క సినిమాలో కూడా పనిచేయని వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది అనేది కరుడుగట్టిన అక్కినేని అభిమానులకు కూడా అర్థం అయ్యేది కాదు.

    అయితే రీసెంట్ గానే శోభిత దూళిపాళ్ల ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో నాగ చైతన్య కి తనకు పరిచయం ఎలా ఏర్పడింది అనేదానిపై మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ ‘నేను నాగార్జున గారి ఇంట్లోకి 2018 వ సంవత్సరం లో అడుగుపెట్టాను. నాకు నాగ చైతన్య కి మధ్య 2022 వ సంవత్సరం స్నేహం ఏర్పడింది. తనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఎప్పుడూ కలిసినా మా మధ్య ఫుడ్ గురించి మాత్రమే చర్చలు ఉండేవి. అయితే నేను నార్త్ ఇండియా కి వెళ్లిన తర్వాత ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. నాగ చైతన్య తో కూడా నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆయన కోపం తెచ్చుకునేవారు. తెలుగులో మాట్లాడమని చెప్పేవారు. అలా తెలుగులో ఇద్దరం మాట్లాడుకోవడం వల్ల మా మధ్య బంధం బలపడింది. మా ఇద్దరి మధ్య పరిచయం తొలిసారి ముంబై లోని ఒక కేఫ్ లో మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చింది.

    ఇంకా ఆమె మాట్లాడుతూ ‘అప్పట్లో నేను ముంబై లో ఉండేదానిని, నాగ చైతన్య హైదరాబాద్ లో ఉండేవాడు. నన్ను కలవాలంటే నాగ చైతన్య ముంబై కి రావాల్సి వచ్చింది. అప్పట్లో నాకు షూటింగ్స్ ఎక్కువగా ముంబైలోనే ఉండడం వల్ల నేను హైదరాబాద్ కి రాలేకపోయాను. కానీ పాపం చైతు నాకోసం చాలా ఇబ్బందులు పడుతూ వచ్చేవాడు. మొదటిసారి మేమిద్దరం బయటకు వెళ్ళేటప్పుడు నేను రెడ్ డ్రెస్ ధరిస్తే , నాగ చైతన్య బ్లూ సూట్ వేసుకొచ్చాడు. కర్ణాటకలో కూడా మేము అనేక పార్కుల్లో తిరిగాము. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకొని ముచ్చటపడిన సందర్భాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కి కూడా ఇద్దరం కలిసి వెళ్ళాము’ అని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. సైలెంట్ గా కనిపించే నాగ చైతన్య ఇంత తతంగం నడిపాడా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.