Roja Daughter: 90లలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రోజా. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటిన తెలుగు అమ్మాయిల్లో రోజా ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆమె వందల చిత్రాల్లో నటించింది. అనంతరం రాజకీయ అరంగేట్రం చేసి ఆమె సక్సెస్ అయ్యారు. టీడీపీలో చేరిన రోజా అనంతరం పార్టీ మారారు. కాంగ్రెస్ లో చేరారు. వైఎస్సార్ మరణం నేపథ్యంలో వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో చేరిన రోజా.. నగరి నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు.
గత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రోజా ఓటమి పాలయ్యారు. ఇటీవల రోజా హైదరాబాద్ వచ్చారు. పలు ఇంటర్వ్యూలలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రోజా దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకుంది. వీరికి అమ్మాయి, అబ్బాయి సంతానం. అమ్మాయి పేరు అన్షు మాలిక. ఈమె ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లనుందట. స్టార్ కిడ్ తో ఆమె వివాహం అట. ఈ మేరకు పుకార్లు చెలరేగాయి. ఈ ప్రశ్నను రోజాను అడగడంతో స్పష్టత ఇచ్చారు.
అవునా… నా వరకు ఈ పుకారు రాలేదు. అన్షు మీద తరచుగా గాసిప్స్ వైరల్ అవుతుంటాయి. పై చదువుల కోసం అమెరికా వెళితే… అక్కడ డాన్స్, నటనలో శిక్షణ తీసుకుంటుందని వార్తలు రాశారు. అన్షు హీరోయిన్ అవుతాను అంటే, నాకు కూడా ఇష్టమే. నేను ప్రోత్సహిస్తాను. కానీ సైంటిస్ట్ కావాలనేది అన్షు డ్రీమ్. మా అమ్మాయి స్టార్ హీరో ఇంటి కోడలు అవుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, అంటూ పుకార్లను రోజా కొట్టిపారేశారు.
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా ఓటమి అనంతరం ఒకింత సైలెంట్ అయ్యారు. ఆమె నటిగా తిరిగి బిజీ కానున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. జబర్దస్త్ జడ్జిగా ఆమె దాదాపు పదేళ్ల పాటు కొనసాగారు. మంత్రి పదవి వరించడంతో నిబంధనల ప్రకారం జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. జబర్దస్త్ జడ్జిగా రీ ఎంట్రీ ఇస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోజా, నాగబాబు జబర్దస్త్ వదిలేశాక, ఆ షో క్రేజ్ కోల్పోయింది.