Shobhita Dhulipalla: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్న వాళ్లందరూ తమ కెరియర్ని చాలా తక్కువ కాలం పాటు కొనసాగిస్తున్నారు. కారణం ఏంటంటే హీరోలకు ఉన్నన్ని అవకాశాలు హీరోయిన్స్ కి రావడం లేదు.ఒక్క సినిమాతో వాళ్ళు సూపర్ సక్సెస్ ని సాధించినా కూడా ఆ తర్వాత సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకుంటే వాళ్లను సినిమా నుంచి తీసేస్తున్నారు… ముఖ్యంగా సక్సెస్ లను సాధించిన హీరోయిన్లను లక్కీ హ్యాండ్ గా గుర్తించి వాళ్ళకి ఎక్కువ అవకాశాలను ఇస్తారు. డిజాస్టర్లను మూట గట్టుకున్న హీరోయిన్లను ఐరన్ లెగ్ అంటూ ముద్రిస్తూ ఉంటారు. దానివల్ల సినిమా అవకాశాలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి…ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ సినిమాలో నటించిన శోభిత ధూళిపాళ్ల సెలెక్టెడ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంది.
అప్పటినుంచి ఇప్పటివరకు తను సోలో హీరోయిన్ గా ఒక సినిమా కూడా రాలేదు. కానీ రీసెంట్ గా ‘చీకట్లో’ అనే ఒక సినిమా డైరెక్ట్ గా ఓటిటి లోకి రావడంతో ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో తను ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా సందర్భంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు ఇకమీదట ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తూ సినిమాలను చేస్తారా? అని అడిగితే ఆమె ఎలాంటి పాత్రనైనా చేస్తానని జనాల గురించి అసలు పట్టించుకోనని చెప్పింది… దాంతో శోభిత సైతం ఇప్పుడు తను డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం మీద అక్కినేని ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తెలియదు.
కానీ మొత్తానికైతే ప్రస్తుతం ఆమె ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించి అటు ప్రేక్షకులను, ఇటు అక్కినేని అభిమానులను సైతం అలరిస్తుంది… ఇక శోభిత నాగచైతన్య కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…