తెలుగు సినిమా ‘స్వర్ణయుగాన్ని’ చవిచూస్తోన్న కాలం అది.. అప్పుడప్పుడే శోభన్ బాబు అనే కుర్రాడు హీరో అవ్వడానికి నానాపాట్లు పడుతున్న కాలం అది. ఎన్టీఆర్ ఏఎన్నార్ స్టార్లుగా వెలిగిపోతున్న అలాంటి కాలంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుని ఎట్టకేలకు హీరోగా నిలబడ్డాడు శోభన్ బాబు. తన అందంతో అభినయంతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించడమే కాకుండా, నవతరం హీరోలకు కూడా తన చిత్రాలలో అవకాశాలు కల్పించి.. చివరికీ తానూ హీరోగానే సినిమా పరిశ్రమను వీడిన నిజమైన హీరో శోభన్ బాబు. ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని.. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడిగా శోభన్ బాబుకు తిరుగులేని రికార్డ్ ఉంది.
Also Read: అభిమాని కుమార్తె పెళ్ళికి ఆర్ధిక సహాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి
అయితే శోభన్ బాబు పర్సనల్ లైఫ్ లోని సీక్రెట్స్ గురించి చాలామందికి తెలియని విషయాల్లో ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చెన్నైలోని నుంగంబాకం దగ్గరలోని రాజారాం మోహతానగర్ లో శాంతి, ప్రశాంతి అనే రెండు ఇళ్ళు ఎప్పుడూ జనంతో రద్దీగా కనిపించేవి. అందులో రోడ్ కి ఎదురుగా ఉండే ఇంటి పేరు శాంతి అని ఉంటుంది. కుడిపక్కగా ఉన్న ఇంటి పేరు ప్రశాంతి అని ఉంటుంది. శాంతి అనే ఇంటిలోనే శోభన్ బాబు ఆయన కుటుంబంతో కలిసి నివసించేవారు. ప్రశాంతి అనే ఇంటిని తన ఆఫీస్ కు సంబంధించిన పనులకు మాత్రమే శోభన్ బాబు ఉపయోగించేవారు. అలాగే శోభన్ తన అభిమానులను, అతిథులను కేవలం ప్రశాంతి అనే ఇంటిలోనే కలుసుకునేవారు.
Also Read: తెలుగు హీరోలకు నిరాశ.. ‘కియారా’కి మరో క్రేజీ ఆఫర్ !
పైగా శాంతి, ప్రశాంతి అనే పేర్లను శోభన్ బాబు అమితంగా ఇష్టపడేవారట. ఆ పేర్లు పెట్టుకున్న వారు ఎవరైనా తన దగ్గరకు వస్తే.. వారితో చాలా బాగా మాట్లాడతారని.. వారు వెళ్లిపోయేటప్పుడు తన గుర్తుగా చిరు కానుకలు లాంటివి ఇచ్చేవారు అని కూడా ఆ రోజుల్లో బాగా వినిపించేవి అట. అయితే.. అసలు శాంతి, ప్రశాంతి అనే పేర్లతో శోభన్ బాబుకు ఉన్న రహస్య ప్రేమ గురించి ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. మరి ఆ పేర్లు పై శోభన్ బాబు అంత ఇష్టాన్ని చూపించడానికి కారణం.. ఆయన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలేనట.. అందుకే ఆ పేర్లు ఆయనకు జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్