Shobha Shetty: శోభాశెట్టి సీరియల్ ద్వారా ఎంత పాపులర్ అయిందో.. అంతకంటే ఎక్కువగా బిగ్ బాస్ వల్ల అభిమానులను సంపాదించింది. ఇక ఈమె ఆట కాస్త డల్ గా ఉన్నా కూడా ప్రేక్షకులు ఓటింగ్ మాత్రం ఆమె సొంతం అవుతుంది. మరోవైపు శోభా ఇంటి నుంచి ఎప్పుడో వెళ్లాల్సింది కానీ ఇన్ని రోజులు ఎలా కంటిన్యూ అవుతుందని కొందరిలో అనుమానం కూడా ఉంది. అయితే సడన్ గా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో ఓ సారి చూసేద్దాం…
శోభా శెట్టి దాదాపుగా 11 వారాల నుంచి బిగ్ బాస్ హౌజ్ లోనే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ఒక్కసారి కూడా ఎలిమినేట్ అవలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. కానీ తాజాగా ఈటీవీ లేటెస్ట్ ప్రోగ్రామ్ ప్రోమోలో కనిపించింది. దాంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితే ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీ ఆలీతో ఆల్ ఇన్ వన్ పేరుతో ఒక రియాలిటీ షో రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పెద్దగా పాపులర్ అవలేదు. కానీ అందులో శోభాశెట్టి పార్టిసిపేట్ చేసింది. ఆమె పార్టిసిపేట్ చేసిన ఎపిసోడ్ నవంబర్ 21న ప్రసారం కానుంది.
ఈ ఎపిసోడ్ అందరూ చూడాలని.. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈటీవీ చేసిన ఈ ప్రోగ్రామ్ ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది. ఎపిసోడ్ కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేసింది ఛానెల్. ఈ ఎపిసోడ్ లో శోభా తో పాటు మరో ఇద్దరు మేల్ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. కానీ వారి కంటే శోభా ఎక్కువ పాపులారిటీ ని సంపాదించింది. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న శోభా సడన్ గా ఈటీవీ ప్రోగ్రామ్ లో ఎలా ప్రత్యక్షం అయింది? దాదాపు 80 రోజులుగా ఆమె హౌజ్ లో ఉంది. బయటకు వచ్చే ఛాన్స్ లేదు.
ఏ విధంగా చూసినా శోభా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. అలాంటిది ఈ ప్రోగ్రామ్ లో ఎలా పాల్గొంది? సీక్రెట్ గా హౌజ్ నుంచి అడుగుపెట్టి ఈటీవీలో కనిపించిందా? అర్ధరాత్రి ఎవరి కంట పడకుండా బయటకు వెళ్లిందా? లేదంటే బిగ్ బాస్ నిర్వాహకుల పర్మిషన్ తీసుకుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకుల్లో మెదులుతున్నాయి. ఈ ప్రోమో చూస్తే చాలా రీసెంట్ గా అనిపిస్తుంది. కాబట్టి ఈ డౌట్స్ రావడం కూడా కామన్. అయితే వాస్తవానికి ఈ టీవీ చాలా రోజుల క్రితం షూట్ చేసిన ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేస్తుంటుంది. అదే పద్ధతిలో శోభా శెట్టి ఎపిసోడ్ కూడా నవంబర్ 21న ప్రసారం చేస్తుందా? అనే అనుమానం కూడా ఉంది. మరి ఈ ఎపిసోడ్ శోభాకు ఎలాంటి ఫలితాన్ని సంపాదించి పెడుతుందో చూడాలి.